ప్రతిష్టాత్మక ఎఫ్-1 రేసులో ప్రమాదం చోటు చేసుకుంది. రేసింగ్‌లో ఒక కారు మరో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దిగ్గజ ఫార్ములావన్ రేసర్ మైఖేల్ షుమాకర్ అల్లుడు డేవిడ్ షుమాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని వెన్నుముక విరిగిపోయినట్లు సమాచారం. అయితే వెన్నుముకకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేకున్నా.. కొన్ని వారాలపాటు మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది. కాగా.. ఈ దుర్ఘటన హాకెన్‌హీమ్ డీటీఎమ్ రేసు సందర్భంగా చోటు చేసుకుంది. […]