రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో సంక్షోభం నెలకొన్నది. ఈ క్రమంలో పలు దేశాలు ముందుకు వచ్చి సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలు వైద్య పరికరాలు, ఇతర అవసరమైన సామగ్రిని పంపాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం వంద మిలియన్ డాలర్ల సాయం ప్రకటించగా శుక్రవారం అమెరికా నుంచి భారత్ తొలి కొవిడ్ అత్యవసర సహాయ సామగ్రిని అందుకున్నది. కొవిడ్ రెండో దశతో పోరాడుతున్న భారత్కు అమెరికా తన మొట్టమొదటి అత్యవసర వైద్య సాయాన్ని అందించింది. […]