అమరావతి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంబిస్తోంది. కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ విధించింది జగన్ సర్కార్. అయినప్పటికీ కరోనా కేసులు ఆగడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్య నిపుణులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పెరుగుతున్న కేసులు, మందుల కొరత, వ్యాక్సిన్ల లేమి, ఆసుపత్రులలో దక్కని […]