హైదరాబాద్- తెలంగణలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారానికి తెర పడింది. తెలంగాణలో కరోనా కేసులను నిరోధించడానికి లాక్ డౌన్ ఏ మాత్రం పరిష్కారం కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదని, అంతే కాకుండా లాక్ డౌన్ వల్ల జనజీవనం స్థంభించిపోతుందని […]