తెలుగు రాష్ట్రాల్లో తీన్మార్ మల్లన్న అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు తీన్మార్ లో మల్లన్నక్యారెక్టర్ తో ప్రజలకు బాగా దగ్గరయ్యాడు తీన్మార్ మల్లన్న. ఆయన అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. పలు ఛానల్స్ లో పనిచేసిన ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం సొంతంగా క్యూ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్నారు.