అమరావతి- ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డికి భహిరంగ సవాల్ విసిరారు. చెంచాలతో మాట్లాడించడం కాదు, జగన్ రెడ్డి దమ్ముంటే నువ్వు రా అంటూ సవాల్ చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిని అడ్డుపెట్టుకుని పల్నాడులో హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లాలో హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య అంత్యక్రియల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చంద్రయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైన తరువాత, […]