కరోనా విపత్తు నేపథ్యంలో తమ వంతుగా మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయించింది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్. ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న మరణాలు, స్మశానాల్లో కరోనా మృతుల దహనానికి కట్టెల కొరత తీవ్రంగా ఉందన్న వార్తల నేపథ్యంలో ఫారెస్ట్ కార్పోరేషన్ స్పందించింది. తమ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా సరఫరా చేస్తామని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఫారెస్ట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున […]