Bojjala Gopala Krishna Reddy: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గత కొద్దిరోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం మరణించారు. బొజ్జల మరణంతో టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతిపై పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, బొజ్జల 1949, ఏప్రిల్ 15న అప్పటి మద్రాస్ స్టేట్లోని ఉరందుర్ గ్రామంలో జన్మించారు. బొజ్జల రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంనుంచి వచ్చిన వారే. ఆయన […]