ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 26న ఏర్పుడుతోంది. గ్రహణం తర్వాత చంద్రుడు సూపర్ బ్లడ్ మూన్ గా దర్శనం ఇవ్వనున్నాడు. ఆరోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి వస్తారు. సూర్యుడు, చంద్రుడి మధ్యలోకి భూమి వస్తుంది. ఈ క్రమంలో సూర్యకిరణాలు చంద్రునిపై పడవు. భూమి నీడ మాత్రమే చంద్రునిపై పడుతుంది. ఈ సమయంలో కాంతి తరంగాలు ఫిల్టర్ అవుతాయి. ఈ సమయంలో కాంతి తరంగాల వల్ల చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపించనున్నాడు. […]