కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు పాకింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆర్మీ అభ్యర్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. స్టాల్స్, రైళ్లను తగులబెట్టారు. ఇక నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు […]