అత్యంత ఆధునిక ప్రయాణ సౌకర్యంగా మెట్రో రైళ్లను చెప్పొచ్చు. ట్రాఫిక్ నియంత్రణతోపాటు ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలను చేర్చేందుకు అతిపెద్ద నగరాలన్నీ మెట్రో మంత్రాన్నే జపిస్తున్నాయి. సురక్షితమైన ప్రయాణానికి కూడా మెట్రో రైళ్లు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. అయితే మెట్రో నిర్వహణ, వాటి నిర్మాణ సామర్థ్యంపై మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోతోపాటు దేశంలోని ఇతర మెట్రోలు ఆధునికమే అయినప్పటికీ వాటి నిర్మాణాల్లోని క్వాలిటీపై మాత్రం ఎన్నోమార్లు విమర్శలు వచ్చాయి. మెట్రో పిల్లర్ల పైకప్పుల్లో నుంచి పెచ్చులు ఊడిపోవడం.. […]