తెలంగాణలోని కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో అరుదైన మొరిగే జింక (బార్కింగ్ డీర్) కనిపించింది. తెలంగాణలో 15 ఏళ్లుగా కనుమరుగైన జింక జాతుల్లో ఒకటైన బార్కింగ్ డీర్. కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ అడవుల్లో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు ఇది చిక్కింది. బార్కింగ్ డీర్‌నే ఇండియన్ మంట్‌జాక్ అని కూడా పిలుస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే తోటి జంతువులు ప్రమాదంలో పడినప్పుడు ఇది కుక్కలా మొరిగి వాటిని హెచ్చరిస్తుంది. అందుకనే దీనిని మొరిగే జింక […]