ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. టీడీపీకి మంచి పట్టున్న కుప్పం నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లి ఎంపీటీసీని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి గంగాధరంపై 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య గెలిచారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 […]