కడప రూరర్- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు అంతకంతకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయవర్గాలతో పాటు సామాన్యుల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. ఎప్పుడూ గంభీరంగా కనిపించే చంద్రబాబు అలా చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేసరికి చాలా మంది చలించిపోతున్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన […]