నంద్యాలకు చెందిన డాక్టర్ ఇమ్మడి అపర్ణ తన పెంపుడు కుక్కకు ఘనంగా పుట్టిన రోజు వేడుక జరిపారు. ఈ పుట్టిన రోజు వేడుకకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్‌గా మారాయి..
సాధారణంగా మనుషులకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుంటూ ఉంటారు. కేకులు, భోజనాలు, బంధుమిత్రులు ఇలా పుట్టిన రోజు వేడుకను సందడి, సందడిగా చేస్తూ ఉంటారు. అయితే, పెంపుడు జంతువులకు పుట్టిన రోజు వేడుకలు చేయటం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సదరు జంతువుల్ని తమ ఇంట్లో సభ్యులుగా భావించే కొద్ది మంది మాత్రమే పుట్టిన రోజు వేడుకను చేస్తూ ఉంటారు. అలా ఓ కుటుంబం తాము ఎంతో ప్రేమగా పెంచుకునే ఓ కుక్కకు ఘనంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించింది. బంధు,మిత్రులను పిలిచి అంగరంగ వైభవంగా తమ ఇంట్లో సభ్యురాలుగా భావిస్తున్న కుక్కకు పుట్టిన రోజు వేడుకను నిర్వహించింది.
ఈ సంఘటన అంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నంద్యాల పట్టణంలోని ఉప్పరి వీధికి చెందిన ఇమ్మడి రామయ్య కూతురు డాక్టర్ ఇమ్మడి అపర్ణ.. పగ్ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నారు. స్నూపీ అని పేరు పెట్టి దాన్ని తమ ఇంట్లో సభ్యురాలిగా పెంచుతూ వచ్చారు. తాజాగా, అది పదవ పడిలోకి అడుగుపెట్టింది. దీంతో ఆమె తన ప్రియమైన స్నూపీకి ఘనంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఇందుకు ఆమె సోదరుడు న్యాయవాది అనిల్ సహకారం అందించారు. అపర్ణ ఓ పెద్ద కేకును స్నూపీతో కోయించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో స్థానికులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
స్థానికులు ఆ ఏర్పాట్లు చూసి విస్మయానికి గురయ్యారు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఇలా పెంపుడు జంతువుల్ని ఇంట్లో సభ్యులుగా పెంచుకోవటం అందరికీ సాధ్యం కాదు.. గ్రేట్’’.. ‘‘ పెంపుడు జంతువుకు ఇలా ఘనంగా పుట్టిన రోజు వేడుక చేయటం అద్భుతంగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, పెంపుడు కుక్కకు ఇలా ఘనంగా పుట్టిన రోజు వేడుక చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
పెంపుడు కుక్కకు పుట్టిన రోజు చేసిన లేడీ డాక్టర్! pic.twitter.com/KUKzCTrizk
— venky bandaru (@venkybandaru13) March 7, 2023