బంగారం ధర షాకులు మీద షాకులు ఇస్తోంది. వరుసగా పెరగడం, లేదా తగ్గడం జరుగుతోంది. పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉండటం లేవు. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే...
బంగారం ధర.. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో.. ఊహించడం కష్టంగా ఉంది. గత నాలుగైదు రోజులుగా బంగారం ధర వరుసగా పెరుగుతూ వస్తుండగా.. తాజాగా నేడు మాత్రం కాస్త తగ్గి ఊరటనిచ్చింది. పరుగులు పెడుతున్న పసిడి ధరకు శుక్రవారం కాస్త బ్రేకులు పడ్డాయి. కానీ వెండి ధర మాత్రం ఎలాంటి అడ్డు అదుపు లేకుండా పెరుగుతూ పోతూనే ఉంది. అంతర్జాతీయంగా కూడా బంగారం రేటు కాస్త తగ్గింది. అక్కడ డాలర్ పుంజుకోవడంతో బంగారం విలువ తగ్గింది. ఇదే క్రమంలో దేశీయంగా రేట్లు తగ్గాయని చెప్పాలి. ఇక నేడు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధర తులం మీద ఎంత తగ్గింది.. వెండి ధర ఎంత పెరిగింది.. నేడు బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయి అంటే..
ఇక నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాముల మీద రూ.100 తగ్గింది. వరుసగా గత రెండు సేషన్లలో రూ.800 మేర పెరిగిన ధర ఇవాళ కాస్త తగ్గడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.56,100గా ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు 10 గ్రాముల మీద రూ.110 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ మేలిమి బంగారం ధర రూ.61,200 పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్ బంగారం రేటు రూ.100 తగ్గి రూ.56,250గా. అలానే 24 క్యారెట్ బంగారం ఢిల్లీలో తులానికి రూ.110 తగ్గి ప్రస్తుతం రూ.61,350 మార్క్ వద్ద ట్రేడవుతోంది.
బంగారం ధర అయినా కాస్త తగ్గుతుందేమో కానీ.. వెండి ధరకు మాత్రం బ్రేకులు పడటం లేదు. ప్రతి రోజు పెరుగుతూ.. ఆల్ టైం హైకి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.400 మేర పెరిగి రూ.81,800 పలుకుతోంది. ఇక ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి రేటు రూ.650 మేర పెరిగి ప్రస్తుతం రూ.78 వేలకు చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2043.20 డాలర్లు పలుకుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 25.89 డాలర్లుగా ఉంది.