భారత్-శ్రీలంక మధ్య గౌహతీ వేదికగా తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ-శుబ్‌మన్ గిల్.. లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేస్తే.. స్కోర్ బోర్డును వేగంగా 100 పరుగుల మార్క్ దాటించారు. అయితే.. 60 బంతుల్లో 11 ఫోర్లతో 70 పరుగులు చేసిన గిల్.. షనకా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రోహిత్ శర్మ కూడా వెనుదిరిగాడు. 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 83 పరుగులు చేసి మధుషంకా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ సైతం 24 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 28 పరుగులు చేసి.. వేగంగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 30 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. కోహ్లీ పెద్ద స్కోర్ చేస్తే.. టీమిండియా లంక ముందు భారీ టార్గెట్ పెట్టే అవకాశం ఉంది.
మ్యాచ్ సంగతి అలా ఉంటే.. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్‌పై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అందుకు కారణం ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టడమే. లంకతో ఈ వన్డేకు ముందు టీమిండియా చివరి వన్డే బంగ్లాదేశ్‌తో ఆడింది. ఆ వన్డేలో ఇషాన్ కిషన్ ఏకంగా ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 126 బంతుల్లోనే 200 పరుగుల బాదేసి.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అలాంటి ప్లేయర్‌ను లంకతో తొలి వన్డేలో పక్కన పెట్టిన టీమిండియా మేనేజ్‌మెంట్.. అందరికి షాకిచ్చింది. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టడాన్ని తప్పుబట్టాడు. గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌ను తర్వాత మ్యాచ్‌కు ఎలా పక్కనపెడతారని ప్రశ్నించాడు. శుబ్‌మన్ గిల్‌కు కావాలంటే చాలా అవకాశాలు ఇవ్వచ్చుకానీ.. కిషన్‌ను పక్కన పెట్టడం సరికాదన్నాడు.
టీ20ల్లో విఫలమైన పంత్‌ను వన్డేలకు పక్కన పెట్టిన వారు.. అన్ని ఫార్మాట్లలో విఫలమైన రాహుల్‌ను మాత్రం అంటిపెట్టుకుని ఉన్నారంటూ చురకలు అంటించాడు. వరుసగా విఫలం అవుతున్న కేఎల్ రాహుల్‌ను మాత్రం జట్టులో ఉంచుకుని.. డబుల్ సెంచరీ చేసిన కిషన్‌నె బెంచ్‌కు పరిమితం చేయడం చూస్తుంటే.. జట్టు ఎంపిక ప్రదర్శన ఆధారంగా చేస్తున్నట్లు అనిపించడం లేదని గట్టిగానే స్పందించాడు. ఇషాన్ కిషన్‌ను గిల్ లేదా కేఎల్ రాహుల్ స్థానంలో తీసుకోవచ్చు. పైగా ఓపెనింగ్ జోడీ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా కుదురుతోంది. ఇక రాహుల్ స్థానంలో ఆడించినా.. కిషన్ కీపింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. అయినా కూడా ఇవేవి ఆలోచించకుండా ఇషాన్‌ను పక్కన పెట్టింది టీమ్ మేనేజ్‌మెంట్. మరి ఈ విషయంలో వెంకటేశ్ ప్రసాద్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Think fair would have been to give chance to a man who scored a double hundred in India’s last ODI, and in a series where India lost two games and the series.
Have all the time in the world for Gill, but no way you drop a player for scoring a double ton. https://t.co/LbzKKH8ynw— Venkatesh Prasad (@venkateshprasad) January 9, 2023