ఐపీఎల్ లో ఒకప్పుడు టాప్ క్లాస్ ప్లేయర్ గా వెలుగొందిన సురేష్ రైనా.. గత ఏడాది ఐపీఎల్ లో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున అద్భుతమైన ఆట తీరును కనబరిచిన రైనా రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ తో మెగా వేలంలో నమోదు చేసుకున్నప్పటికీ అతన్ని తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. పది ఫ్రాంచైజీల్లో ఒక్క ఫ్రాంచైజీ కూడా ఈ స్టార్ బ్యాట్స్ మేన్ ను తీసుకోకపోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. అమ్ముడుపోనప్పటికీ ఏదో ఒక జట్టులో భర్తీ చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ అది కూడా జరగలేదు. దీంతో మిస్టర్ ఐపీఎల్ పూర్తిగా మిస్ అయ్యారు. ఆటకు దూరమైనప్పటికీ.. రైనా ఎలైట్ కామెంటరీ ప్యానెల్ లో సభ్యుడిగా చేరి కామెంటరీ చేసి అభిమానుల్లో కొంత ఉత్సహాన్ని నింపారు. అయితే మళ్ళీ సురేష్ రైనా పిచ్ లో బ్యాట్ పట్టుకుని.. బంతిని కొడుతుంటే చూడాలన్న అభిమానుల ఆశ మాత్రం చావలేదు. వాళ్ళు బలంగా కోరుకున్నారు కాబోలు రైనాను దేవుడు కరుణించాడు.
దక్షిణాఫ్రికాలో త్వరలో జరగబోతున్న టీ20 లీగ్ లో రైనాకు అవకాశాలు ఉండవచ్చునని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఆన్ డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో రైనా ఒకరని ఆకాష్ చోప్రా అన్నారు. దక్షిణాఫ్రికాలో త్వరలో ప్రారంభం కానున్న టీ20 టోర్నమెంట్ లో పాల్గొనే మొత్తం 6 ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఇది రైనాకు అనుకూలంగా పనిచేస్తుందని చోప్రా అన్నారు. భారత ఫ్రాంచైజీలు.. CSA టీ20 (క్రికెట్ సౌత్ ఆఫ్రికా టీ20) లీగ్ లో మొత్తం ఆరు జట్లను కొనుగోలు చేశారు కాబట్టి మన ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. తమ ఆటగాళ్లను వేర్వేరు ప్రదేశాల్లో ఆడాలని.. ఫ్రాంచైజీలు కోరుకునే అవకాశం ఉన్నందున మన వాళ్ళకి ఈ లీగ్ లో చోటు ఉంటుందని, అందులో రైనా తప్పక ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిజానికి రైనా ఫ్రాంచైజీ క్రికెట్ లో రాణించడాన్ని తాను చూస్తున్నానని, రైనా చాలా ఆసక్తికరమైన ఆటగాడని, అతని కోసం డబ్బులు పెట్టడానికి ఫ్రాంచైజీలు ముందుకొస్తాయని ఆకాష్ చోప్రా ధీమా వ్యక్తం చేశారు. దీంతో రైనా అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. ఏ దేశం అయితే ఏముంది.. ఏ లీగ్ అయితే ఏముంది.. ఏ గ్రౌండ్ అయితే ఏముంది.. తమ అభిమాన ఆటగాడు గ్రౌండ్ లో ఫోర్లు, సిక్సులతో బౌలర్లకి చుక్కలు చూపిస్తుంటే.. బ్యాక్ గ్రౌండ్ లో మేము సీఎస్కే ఆర్ఆర్ మాత్రం వేసుకుంటామని అభిమానులు అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Ricky Ponting: జట్టు నుంచి అతన్ని తప్పించి.. పంత్, కార్తీక్‌ను ఉంచండి: రికీ పాంటింగ్
ఇది కూడా చదవండి: Uppal Cricket Stadium: చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడనున్న టీమిండియా