గత కొంతకాలంగా మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు ఆద్యం పోసేలా వీరిద్దరూ కలిసి పలు పూజా కార్యక్రమాల్లో జంటగా దర్శనమిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ నడుస్తుందని కథనాలు వచ్చాయి. మంచు మనోజ్ కూడా ఈ వార్తలను ఖండించలేదు గానీ మంచి రోజు చూసుకుని చెప్తాను అని అన్నారు. దీంతో మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి నిజమే అని అనుకున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మంచు లక్ష్మి స్పందించారు. మంచు లక్ష్మి స్పందించిన తీరు చూస్తే.. మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతుండడం ఖాయమని తెలుస్తోంది.
ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పైన, మంచు మనోజ్ రెండో వివాహం పైన ఇలా పలు విషయాలపై స్పందించారు. ఈ క్రమంలో “మనోజ్ ఇప్పుడు రెండో వివాహం చేసుకోబోతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటని సదరు యాంకర్ ప్రశ్నించగా.. మంచు లక్ష్మి తనదైన శైలిలో స్పందించారు. “మనోజ్ పెళ్లి చేసుకుంటుంటే నేనేమంటానండి బాబు. ఎవడి దూ* వాడిది. ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి. ఈరోజుల్లో ప్రపంచంలో ప్రేమని గుర్తించడం చాలా కష్టం. నిజాయితీ గల, నిజమైన ప్రేమని మనోజ్ పొందినందుకు సంతోషంగా ఉంది. నేను బ్లెస్ చేస్తున్నా. అంతే” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ అయ్యాక తనపై విపరీతమైన నెగిటివ్ వచ్చిందని మంచు విష్ణు అన్నారని, కొంతమంది నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిపై మీరేమంటారు అని సదరు యాంకర్ అడిగారు. దానికి మంచు లక్ష్మి సమాధానమిస్తూ.. “మా ఇదంతా బుల్ షిట్. పొలిటికల్ సిస్టంలో ఒకరు బాగున్నారంటే ఒకరు బాలేదని చెప్పడానికి రెడీగా ఉంటారు. ఒక రంగంలో దిగాక మంచితో పాటు చెడుని కూడా యాక్సెప్ట్ చేయాలి. చెడు అంటే వాళ్ళు నిన్ను చెడు అంటే చెడ్డవాడివి అయిపోతావా? ఖచ్చితంగా హుందాతనాన్ని ప్రదర్శించాలి” అంటూ విష్ణుకి సలహా ఇచ్చారు. “సెలబ్రిటీలం కాబట్టి మేము అద్దాల మేడల్లో ఉంటాము. ఎప్పుడెప్పుడు తప్పులు చేస్తామా అని కాచుకుని కూర్చుంటారు జనం. విష్ణు తెలుసుకోవడానికి సమయం పడుతుంది. మమ్మల్ని ఇండస్ట్రీలో బాగానే రిసీవ్ చేసుకుంటారు. కానీ ఈ నెగిటివిటీ ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు” అని ఆమె అన్నారు. ఏది ఏమైనా గాని విమర్శలను పాజిటివ్ గా తీసుకుంటామని ఆమె అన్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి ఆహా ఓటీటీలో ‘ఆహా భోజనంబు’ అనే కుకింగ్ సిరీస్ చేస్తున్నారు.