మంచు లక్ష్మి.. నటిగా, హీరోయిన్గా, హోస్ట్ గా తనని తాను నిరూపించుకున్నారు. అమెరికాలో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుని తర్వాత టాలీవుడ్లో అడుగుపెట్టారు. మంచు మోహన్‌బాబు కుమార్తె అనే పేరు నుంచి మంచు లక్ష్మి తండ్రి మెహన్ బాబు అనిపించుకునే స్థాయికి ఎదిగారు. వెండితెరకు కొన్నాళ్లు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు నటనలో జోరు పెంచింది. లేచింది మహిళా లోకం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. మరోవైపు చెఫ్ మంత్రా అంటూ ఆహాలో ఒక కుకింగ్ షోకి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా మంచు లక్ష్మి కెరీర్లో చాలా బిజీగా ఉంటోంది. ఈరోజు(అక్టోబర్ 8) ఆవిడ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మెగా కోడలు ఉపాసన కూడా మంచు లక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాసన, రామ్ చర్, మంచు లక్ష్మి కలిసున్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హ్యాపీ హ్యాపీ రాక్ స్టార్ అంటూ కోట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ పిక్‌లో ముగ్గురూ రాక్స్టార్ల తరహాలో ఎంతో స్టైల్‌గా, స్వాగ్ తో ఉన్నారు. నిజానికి మంచు లక్ష్మి టాలీవుడ్లో చాలా మందితో క్లోజ్‌గా ఉంటుంది. వారిలో మెగా కోడలు, రామ్ చరణ్ ముందుంటారు. తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా బాగా వినిపిస్తూ ఉంటుంది. రకుల్ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా మంచు లక్ష్మికి బర్త్ డే విషెస్ చెప్పింది. నా సోల్ సిస్టర్‌కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ వాళ్లిద్దరూ కలిసున్న ఫొటోని షేర్ చేసింది. రకుల్- లక్ష్మి రిలేషన్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లిద్దరూ ఎంత క్లోజో సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారికి అందరికీ తెలిసిందే.
ఇంక వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఏకైక కుమార్తె మంచు లక్ష్మి. ఆమె 1977 అక్టోబర్ 8న జన్మించారు. మంచు లక్ష్మి చిన్నప్పుడే తన తండ్రి నటించే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు. కూతురులోని టాలెంట్ ని గ్రహించిన మోహన్ బాబు ఆమెను నటన వైపు ప్రోత్సహించారు. నటనపై మక్కువతో అమెరికాలో యాక్టింగ్ కోర్సు నేర్చుకుని అక్కడే టీవీ సీరియల్స్ లో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత టాలీవుడ్ లో రాణించేందుకు అమెరికా నుంచి ఇండియా వచ్చేశారు. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంలోనే విలన్ గా అందరినీ మెప్పించారు. ఐరేంద్రిగా ప్రేక్షకులను మెప్పించిన మంచు లక్ష్మికి బెస్ట్ విలన్ గా నంది అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.