మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక గాడ్ ఫాదర్ సినిమా బాలీవుడ్లో కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. దీంతో గాడ్ ఫాదర్ సినిమా కోసం మరో 600 థియేటర్స్‌ను కేటాయించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, పూరి జగన్నాథ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన గాడ్ ఫాదర్ కలెక్షన్స్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ సినిమాలో ఓ ఆసక్తికర అంశాన్ని ప్రేక్షకులు గుర్తించారు. అదేంటంటే.. గాడ్ ఫాదర్ టైటిల్స్‌లో ఏపీ పోలీసు అధికారి పేరు వేయడమే కాక.. ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దీని గురించి సదరు పోలీసు అధికారి ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
ఇక గాడ్ ఫాదర్ సినిమాలో టైటిల్స్‌లో కనిపించిన పోలీస్ అధికారి ఎవరో కాదు.. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ.. టైటిల్ కార్డ్స్‌లో ఫకీరప్ప పేరు వేశారు. ఇది చూసిన ప్రేక్షకులు.. అసలు ఫకీరప్ప పేరు ఎందుకు వేశారని.. డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఫకీరప్ప పేరు వేయడానికి కారణం ఏంటంటే.. గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 28న అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన సంగతి తెలిసిందే.
భారీ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. జోరువానలోనూ అభిమానాలు మెగాస్టార్ చిరంజీవి కోసం వచ్చి ఈవెంట్‌ను విజయవంతం చేశారు. జోరువానలో తడుస్తూ.. మెగస్టార్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇంత భారీ స్థాయిలో వచ్చిన అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవెంట్‌కు పూర్తి స్థాయిలో భద్రత కల్పించారు. దీని గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ఈవెంట్ ఇంత సక్సెస్ కావడానికి, వర్షంలోనూ ఇంత డెడికేషన్ చూపించిన పోలీసులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
అయితే కృతజ్ఞత చెప్పడంతోనే అయిపోయింది అనకోలేదు చిరంజీవి. ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం పోలీస్ శాఖ చూపిన ప్రత్యేక శ్రద్ధ చిరంజీవి మనసును హత్తుకుంది. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం కోసం ఏకంగా గాడ్ ఫాదర్ టైటిల్స్‌లో స్క్రీన్ మీద ఎస్పీ ఫక్కీరప్ప పేరును వేయించి కృతజ్ఞతలు తెలిపారు. “THANKS TO DR. FAKKEERAPPA KANGINELLI,ips… Govt arts college and officials” అంటూ టైటిల్స్‌లో వేశారు. ఈ విషయం తెలిసి ఫకీరప్ప సంతోషం వ్యక్తం చేశారు.
బిగ్ స్క్రీన్‌పైన అందులోను మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్‌లో తన పేరు కనిపించడంతో ఫుల్ ఖుషీ అయిన అనంతపురం ఎస్పీ ఫకీరప్ప.. తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా అందరితో షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ టూ గాడ్ ఫాదర్ అంటూ స్క్రీన్ పై తన పేరు వచ్చిన ఫోటోను ఫకీరప్ప ట్వీట్ చేశారు. ప్రసుత్తం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే వందల మంది దీన్ని లైక్ చేయడమే కాక షేర్ చేస్తున్నారు. ఇక చిరంజీవి సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం ఈ ట్వీట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.
Thank you #GodFather
Found this one in #GodFather movie screening.@KChiruTweets pic.twitter.com/oPBNaA3ng1— Dr.Fakkeerappa Kaginelli IPS (@Fakkeerappa_IPS) October 6, 2022