తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మేనియా. చిరు చేసిన గత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. దీంతో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని బరిలోకి దిగిన మెగాస్టార్.. తను అనుకున్నది సాధించారు. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా, రూ. 69.12 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దీంతో మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాక్ ఈజ్ బ్యాక్ అని సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఎవరిని అడిగినా సరే ‘గాడ్ ఫాదర్’ గురించే మాట్లాడుకుంటున్నారు.
69.12 crores in 2 Days ❤️🔥
HUMONGOUS BLOCKBUSTER #GodFather setting the box office on fire 🔥
Book your tickets now
– https://t.co/qO2RT7dqmM#BlockbusterGodfatherMegastar @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @ActorSatyaDev @MusicThaman @ProducerNVP pic.twitter.com/yBVyHA5t8D
— Konidela Pro Company (@KonidelaPro) October 7, 2022
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళ హిట్ ‘లూసిఫర్’కి తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’. పేరుకే రీమేక్ సినిమా గానీ పలు మార్పులు చేయడం వల్ల ఇక్కడ హిట్ గా నిలిచింది. ప్రేక్షకులు ఆదరణ దక్కించుకుంటోంది. ఇక పొలిటికల్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో బ్రహ్మగా చిరంజీవి యాక్ట్ చేయగా.. నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సముద్రఖని, సల్మాన్ ఖాన్ తదితరులు కీ రోల్స్ చేశారు. ఇక నయన్-చిరు తండ్రిగా, ముఖ్యమంత్రి పీకేఆర్ పాత్రలో సర్వదామన్ బెనర్జీ కనిపించారు. టాలీవుడ్ లో కొన్ని సినిమాలే చేసినప్పటికీ.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
1986లో కళాతపస్వి కె.విశ్వనాథ్ తీసిన ‘సిరివెన్నెల’ సినిమాలో చిరంజీవితోపాటు సర్వదామన్ బెనర్జీ హీరోగా నటించారు. అద్భుతమైన పాటలకు తోడు స్టోరీ కూడా ఉండేసరికి ‘సిరివెన్నెల’ సినిమా.. తెలుగు ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంతోనే గేయ రచయిత సీతారామశాస్త్రి.. సిరివెన్నెల సీతారామశ్రాస్త్రి అయ్యారు. ఇక తెలుగు రాకపోయినప్పటికీ సినిమాలో అంధుడిలా నటించిన సర్వదామన్ అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసిన ఆయన.. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా ఉండిపోయారు. 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’తో రీఎంట్రీ ఇచ్చారు. జనరేషన్స్ మారిపోవడం, మూడు దశాబ్దాల తర్వాత ఈయన తెలుగులో సినిమా చేయడంతో ఆయన్ని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. మరి మీరు ఏమైనా గుర్తుపడితే.. దిగువన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.