నటీనటులకు అభిమానులు లక్షలు, కోట్లల్లో ఉంటారు. వీళ్లతో ఎంత మంచిదో అంతా డేంజర్ కూడా. ఎందుకంటే తమ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ కోసం ఏం చేసేందుకైనా సరే రెడీగా ఉంటారు. ఇక వాళ్ల ఫేవరెట్ యాక్టర్ ని మీరు గానీ ట్రోల్ చేస్తే మాత్రం మీ పని అయిపోయినట్లే. ఫ్యాన్ వార్స్ మొదలుపెడతారు. మీరు క్షమాపణ చెప్పేవరకు అస్సలు వదలరు. ఇదంతా నాణానికి ఓవైపు. మరోవైపు కొందరు వ్యక్తులు.. అభిమానుల పేరు చెప్పుకుని మోసాలు చేస్తుంటారు. ఏకంగా సినీ సెలబ్రిటీలనే బురిడీ కొట్టిస్తుంటారు. టాలీవుడ్ లోనూ ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా సేమ్ అలానే ప్రముఖ కమెడియన్ ని, అభిమాని అని చెప్పిన ఓ వ్యక్తి మోసం చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళంలో 270కి పైగా సినిమాల్లో కమెడియన్, సహాయ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బోండా మణి. ప్రస్తుతం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. తిరువళ్లూరులోని అయ్యప్పన్ తాంగల్ వీజీఎన్ నగర్ లో మణి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. కొన్నిరోజుల క్రితం.. అనారోగ్య సమస్యలతో చెన్నై ఓమందూరార్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేరాడు. ఇతడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో.. దాతల సాయం కోరాడు. ఇతడికి తమిళ హీరోలు ధనుష్, విశాల్, మాజీ మంత్రి జయకుమార్ సహా పలువురు కొంత మొత్తం అందించారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం కూడా నేరుగా మణిని పరామర్శించి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం దాతల సాయంతో మందులు, ఇతర ఖర్చులు మణి చేస్తున్నారు. అయితే ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో వీరపాండికి చెందిన రాజేశ్ ప్రదీప్, తనని తాను అభిమానిగా పరిచయం చేసుకున్నాడు. మణికి దగ్గరుండి సాయం చేశాడు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో సెప్టెంబరు 27న డిశ్చార్జ్ అయ్యారు. మణితో పాటు రాజేశ్ కూడా ఇంటికి వచ్చాడు. అదే రోజు మణి భార్య మాధవి.. రాజేశ్ కి తన ఏటీఎం కార్డు ఇచ్చి మందులు తీసుకురమ్మని సూచించారు. కార్డు ఇచ్చిన కొద్దిసేపటికే.. చెన్నైలోని ఓ నగల దుకాణం నుంచి రూ.1.04 లక్షల విలువైల నగులు కొన్నట్లు మణి ఫోన్ కి మెసేజ్ వచ్చింది. దీంతో మాధవి షాకయ్యారు. ఏమైందా అని అభిమాని రాజేశ్ కి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పదిరోజుల తర్వాత రాజేశ్ ని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అతడు మారుపేర్లతో చాలా మోసాల చేసినట్లు తేలింది. పలుచోట్లు చైన్ స్నాచింగ్, చీటింగ్ కేసులు కూడా అతడిపై ఉన్నట్లు బయటపడింది. మరి ఫ్యాన్ అని చెప్పుకుని.. కమెడియన్ మణిని మోసం చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.