డార్లింగ్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ ఫస్ట్ చూడగానే మీకు ఏమనిపించింది. ఇంత పెద్ద స్టార్ హీరోతో బొమ్మల సినిమానా? అసలు డైరెక్టర్ ఎవడ్రా బాబు ఇలా తీశాడు.. వాడికి అస్సలు బుర్ర లేదు లాంటి చాలా మాటలు నెటిజన్స్ నుంచి వినిపించాయి. ఇక కొందరు రాజకీయ నాయకులైతే ఏకంగా ‘ఆదిపురుష్’ సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ట్విట్టర్ లోనూ ‘బ్యాన్ ఆదిపురుష్’ ట్రెండ్ నడిచింది. ఇప్పుడు సడన్ గా అందులో చాలామంది మాట మార్చేశారు. త్రీడీలో ‘ఆదిపురుష్’ టీజర్ చూసి ఆహా ఓహో అంటున్నారు.
#AdiPurush3DTeaser Superb, Cartoon la undhi ani evad cheppad, KCPD 🤙🏻💥 – #MaheshBabu fan reaction. #AdiPurush #Prabhas pic.twitter.com/qHxHF7v8Mm
— ִֶָ (@charanvicky_) October 8, 2022
#Adipurush3DTeaser release Celebrations in Anantapur 🙂
1. Jr Rebels on 😎🔥 pic.twitter.com/0EEG9JXA3F
— ͏ ͏Anantapur PBFC ™ (@Anantapur_PBFC) October 7, 2022
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఆదిపురుష్’. రామాయణం బ్యాక్ డ్రాప్ తో తీస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్.. శ్రీరాముడిగా చేస్తున్నాడు. కోరమీసంతో ఉన్న డార్లింగ్ లుక్ అభిమానులకు తెగ నచ్చేసింది. రాముడి విషయం ఓకే.. రావణుడి పాత్రే విచిత్రంగా అనిపించింది. సైఫ్ అలీఖాన్ చేసిన ఆ పాత్రకి స్పైక్స్ హెయిర్ స్టైల్, గడ్డం ఉండటం ఫ్యాన్స్ కే కాదు అసలు ఎవరికీ నచ్చేలేదు. ఇక రావణుడి వాహనంగా ఓ విచిత్రమైన పక్షిని గ్రాఫిక్స్ లో క్రియేట్ చేశారు. అదయితే ఇంకా దారుణంగా ఉంది. ఇక హనుమంతుడి పాత్రధారి విషయంలోనూ రాజకీయంగా రచ్చ రచ్చ జరిగింది.
ఇప్పుడిదంతా సైడ్ అయిపోయింది. ఎందుకంటే ‘ఆదిపురుష్’ త్రీడీలో టీజర్ ని దేశవ్యాప్తంగా కొన్ని థియేటర్లలో తాజాగా రిలీజ్ చేశారు. అంతకు ముందు మొబైల్లో చూసి మూవీ టీంని ట్రోల్ చేసిన వాళ్లందరే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ టాక్ ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటివరకు డీలా పడ్డా ప్రభాస్ అభిమానులు.. ఇప్పుడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. జస్ట్ త్రీడీ టీజర్ కే ఇలా అవుతున్నారంటే.. ఇక థియేటర్లలోకి వచ్చేంతలోపు… ప్రేక్షకుల్ని, సోషల్ మీడియా విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొన్ని మార్పులు చేసే అవకాశముంటుంది. అది ‘ఆదిపురుష్’ సినిమాకు ఇంకా ప్లస్ అయ్యే ఛాన్సుంటుంది.
ఇదిలా ఉండగా ప్రభాస్-కృతిసనన్.. శ్రీరాముడు-సీతగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. దాదాపు రూ.500 కోట్లతో నిర్మించారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది.. మూవీ రిలీజ్ అయితే గానీ తెలీదు. ఇక ఈ సినిమా టీజర్ నే అయోధ్యలో లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ విషయంలో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఓ సినిమా గ్రాఫిక్స్ బట్టి సినిమాపై అంచనాకు రాలేం. కొన్నికొన్నిసార్లు థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల రెస్పాన్స్ బట్టి కూడా టాక్ మారిపోవచ్చు. మరి మీలో ఎవరైనా ‘ఆదిపురుష్’ త్రీడీ టీజర్ చూశారా? ఒకవేళ చూస్తే మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
#Adipurush3DTeaser
Kurnool Anandh Theatre 💥💥#PrabhasEra pic.twitter.com/lk94eN3BNZ— Sahooo (@Mahimahesh1998) October 7, 2022
Mind blowing experience in 3D.#Adipurush3DTeaserMania #Adipurush3DTeaser #Prabhas @omraut @UV_Creations @TSeries @LahariMusic #SaifAliKhan #Salaar @amb_cinemas #jan2023 #JaiShreeRam @kritisanon #rebelstar @AjayAtulOnline pic.twitter.com/ooqFmh9Lg7
— Srikar Ch (@SrikarChikile) October 7, 2022