ఫ్లాట్ కొనాలి అని అనుకుంటున్నారా? మియాపూర్ కి దగ్గరలో ఓ ఏరియాలో రూ. 30 లక్షలకే 2 బీహెచ్‌కే ఫ్లాట్ వస్తుంది. ఆ ఏరియా ఏంటి? అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? అక్కడ వృద్ధి రేటు బాగుందా? లేదా? అనే వివరాలు మీ కోసం.
హైదరాబాద్ లో ఫ్లాట్ కొనాలి అనుకుంటే గనుక 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనడం మంచిది. ఎందుకంటే ఈరోజుల్లో అందరూ ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. పైగా భవిష్యత్తులో రీసేల్ చేయాలన్నప్పుడు త్వరగా అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లోని మియాపూర్ కి 10 కి.మీ. లోపు దూరం ఉన్న ఏరియాలో 30 లక్షలకు 2 బీహెచ్‌కే ఫ్లాట్ వస్తుంది. ఈ ఏరియాలో 30 లక్షల నుంచి 60 లక్షల వరకూ ఉన్నాయి. చదరపు అడుగు రూ. 2,500 నుంచి 3 వేలు, 5 వేలు, 7 వేలు, 8 వేలు ఇలా ఉన్నాయి. తీరా కొన్నాక రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందో అన్న బెంగ లేదు. ఎందుకంటే పదేళ్లుగా ఆ ఏరియా వృద్ధి రేటు అనేది చాలా బాగుంది. ఇదొక్కటే కాదు ఇలాంటి ఏరియాలు చాలానే ఉన్నాయి. హైదరాబాద్ లోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ జోన్ ఏరియాల్లో ఫ్లాట్ల ధరలు ఎలా ఉంటాయో అనేది ఇదివరకే చెప్పాము. ఇప్పుడు హైదరాబాద్ లోని మిగిలిన ఏరియాల్లో ఫ్లాట్ ధరలు ఎలా ఉన్నాయి? ఈ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఏ ఏరియాలో ఫ్లాట్స్ తక్కువ ధరకు వస్తున్నాయి? అనే వివరాలు చూద్దాం.
కిష్టారెడ్డిపేటలో మధ్యతరగతి వాళ్ళు భరించగలిగే బడ్జెట్ లో కొత్త ఫ్లాట్స్ దొరుకుతున్నాయి. నగరంలోని ఫేమస్ ఏరియాల్లో 1 బీహెచ్‌కే ఫ్లాట్ కూడా దొరకడం కష్టమే. అలాంటిది 30 లక్షల బడ్జెట్ లో ఈ ఏరియాలో 2 బీహెచ్‌కే ఫ్లాట్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్, మియాపూర్, బీహెచ్ఈఎల్ మరియు మిగతా సిటీ సెంటర్స్ కి సమీపంలో ఉంటుంది. మియాపూర్ నుంచి కేవలం 9.7 కి.మీ. దూరంలో కిష్టారెడ్డిపేట ఏరియా ఉంది. కార్ పార్కింగ్, లిఫ్ట్ సదుపాయం, పవర్ బ్యాకప్, రోడ్ ఫేసింగ్ సహా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ఫ్రీ హోల్డ్ ఓనర్ షిప్ తో కూడిన ఫ్లాట్స్ ని అమ్ముతున్నారు. ఇంతకంటే తక్కువ బడ్జెట్ లో కూడా ఫ్లాట్స్ ఉన్నాయి.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో సేకరించబడిన సమాచారం ఆధారంగా తెలుపబడినవి. ఇవి సగటున ఆ ఏరియాల్లో పలుకుతున్న ధరలు. వీటిలో హెచ్చుతగ్గులు ఉంటాయని గమనించగలరు. మీకు ఒక అవగాహన రావడం కోసం ఇవ్వబడింది. అసలైన ధరలు తెలుసుకోవడానికి స్థానిక యజమానులను, రియల్టర్లను సంప్రదించవలసినదిగా మనవి.