ఉప్పల్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 63 పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. సూర్యకుమార్ యాదవ్ కంటే కోహ్లీకే ఎక్కువ ప్రశంసలు దక్కుతున్నాయి. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసిన సూర్యకే కదా క్రెడిట్ దక్కాలని కొంతమంది వాదిస్తున్నా.. మ్యాచ్‌లో కోహ్లీ ఎలాంటి కీరోల్ ప్లే చేశాడో ఒక సారి తెలుసుకుందాం.
187 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ వికెట్లను కోల్పోయింది. అప్పటి జట్టు స్కోర్ 3.4 ఓవర్లలో 30 మాత్రమే. పైగా పిచ్ అనూహ్యమైన బౌన్స్‌తో ఆసీస్ బౌలర్లకు సహకరిస్తుంది. కేఎల్ రాహుల్ ఒక పరుగుకే అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడాలో నిర్ణయించుకున్నాడు. పవర్ ప్లే నాలుగో ఓవర్‌లో రోహిత్ అవుటైన తర్వాత సూర్యకుమార్ కోహ్లీకి జతకలిశాడు. అప్పుడే వచ్చిన సూర్యపై ఒత్తిడి పడకుండా.. అలాగే పవర్‌ప్లేలో రన్‌రేట్ పడిపోకుండా చివరి ఓవర్‌లో ఒక సిక్స్, ఫోర్ కొట్టి జట్టు స్కోర్‌ను 50కి చేర్చాడు కోహ్లీ. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ రిథమ్ అందుకున్నాడని తెలిసి అతనికే ఎక్కువగా స్ట్రైకింగ్ ఇచ్చాడు.
కోహ్లీ అవతి ఎండ్‌లో ఉన్నాడనే ధైర్యంతో సూర్యకుమార్ తన సహజశైలిలో ఆడాడు. సూర్య చెలరేగుతున్నంత సేపు ప్రేక్షకపాత్ర వహించి కోహ్లీ.. సూర్య ఎటాకింగ్‌ప్లే ఆడే ఫ్రీడమ్ ఇచ్చాడు. మరో ఎండ్‌లో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. సూర్య ఎప్పటిలాగే తన పవర్ హిట్టింగ్‌తో రెచ్చిపోయాడు. 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులు చేసి 14వ ఓవర్‌లో వేగంగా ఆడే క్రమంలోనే అవుటయ్యాడు. సూర్య నుంచి జట్టు, కోహ్లీ ఏం ఆశించారో.. అది సూర్య చేసేశాడు. కానీ.. ఇంకా పని పూర్తి కాలేదు. విజయానికి ఇంకా 57 పరుగులు కావాలి. ఇప్పుడు కోహ్లీ మళ్లీ గేర్ మార్చి వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే అతను కూడా 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమైన దశలో సామ్స్ బౌలింగ్‌లో తొలి బంతినే సిక్స్ కొట్టి మ్యాచ్‌ను టీమిండియా చేతుల్లో పెట్టేశాడు. 5 బంతుల్లో 5 పరుగులు మాత్రమే కావాల్సిన టైమ్‌లో మరో సూపర్ ఓవర్ ది కవర్స్‌షాట్ ఆడాడు. కానీ.. ఫించ్ అద్భుతమైన క్యాచ్‌తో కోహ్లీ ఇన్సింగ్స్‌కు తెరపడింది. 48 బంతుల తీసుకున్నా.. 3 ఫోర్లు, 4 సిక్సులతో 63 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మిగిలిన లాంఛనాన్ని పాండ్యా, దినేష్ కార్తీక్ పూర్తి చేశారు. 63 పరుగులు చేసేందుకు సూర్యకుమార్ యాదవ్ కంటే కోహ్లీ ఎక్కువ బంతులు ఆడి ఉండొచ్చు కానీ.. లక్ష్యఛేదనలో అతను ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరును ప్రశంసించాలి. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా.. కొత్తగా వచ్చిన బ్యాటర్‌పై ఒత్తిడి పెట్టకుండా వేగంగా ఆడి కావాల్సిన రన్‌రేట్‌ను మేయింటేన్ చేశాడు. మరో ఎండ్‌లో సూర్య వేగంగా ఆడుతుంటే వికెట్ పడకుండా సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడు. ఆసీస్ డేంజరస్ బౌలర్ ఆడమ్ జంపాను టార్గెట్ చేసి.. సూర్యకు బ్యాటింగ్ ఈజీ చేశాడు.
సూర్య అవుటైన తర్వాత మళ్లీ వేగంగా ఆడటంతో పాటు ముఖ్యంగా చివరి వరకు క్రీజ్‌లో ఉన్నాడు. మ్యాచ్‌ను టీమిండియా చేతుల్లో పెట్టాడు. అందుకే సూర్య కంటే కోహ్లీ ఆడిన ఇన్నింగ్సే చాలా కీలకమైనది. సూర్యతో పాటు కోహ్లీ ఒక గేర్‌లో బ్యాటింగ్ చేసి ఉంటే ఇద్దరూ వెంటవెంటనే అవుట్ అయితే పరిస్థితి వేరుగా ఉండేదని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఛేజింగ్‌లో ఏ టైమ్‌లో ఎలా ఆడాలో కోహ్లీకి బాగా తెలుసూ.. అందుకే అతన్ని ఛేజ్ మాస్టర్ అంటారు. కాగా ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు వచ్చి చేరింది. టీ20ల్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఆస్ట్రేలియా 19 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 718 పరుగులు చేశాడు. మరి ఆసీస్‌తో చివరి మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🗨️🗨️ I am enjoying my process at the moment: @imVkohli
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/7JlLTyDj6y
— BCCI (@BCCI) September 25, 2022
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/FLvsIGc9sg
— BCCI (@BCCI) September 25, 2022
For his breathtaking batting display in the chase, @surya_14kumar bags the Player of the Match award. 👏 👏
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/YrvpUyDTxt
— BCCI (@BCCI) September 25, 2022
ఇది కూడా చదవండి: నేనేం చేయాలో రోహిత్, రాహుల్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి సైగలతో చెప్పారు: కోహ్లీ