ఐపీఎల్ 2023 ఆరంభానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ ఐపీఎల్‌నైనా ఆర్సీబీ కప్ కొట్టాలని ఆ జట్టు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ ఎలా ఉంది? కప్ కొట్టేంత సీన్ ఆ జట్టుకు ఉందా?.. ఇప్పుడు తెలుసుకుందాం
క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ వినోదాన్ని అందించే.. ధనాధన్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ జట్టుకు విజయావకాశాలు ఎలా ఉన్నాయో అంటూ క్రికెట్ అభిమానులు చర్చించుకోవడం సైతం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో భారీ క్రేజ్ ఉన్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విన్నింగ్ ఛాన్సులపై కూడా భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. కనీసం ఈ సారైనా ఆర్సీబీ కప్పు కొడుతుందా? కొట్టదా? అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఐపీఎల్ 2023లో ఆర్సీబీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? బ్యాటింగ్‌లో బలమెంతా? బౌలింగ్‌లో పదునెంతా? అనే విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
బ్యాటింగ్..
గతేడాది ఆర్సీబీ ప్లే ఆఫ్స్ వరకు వెళ్లింది. ఈ ఏడాది మాత్రం కప్పు కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. దాదాపు గతేడాది ఆడిన జట్టునే కొనసాగిస్తున్న ఆర్సీబీ.. 2023 మినీ వేలంలో కొనుగోలు చేసిన విల్ జాక్స్ గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతని స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ బ్రేస్‌వెల్‌ను తీసుకుంది. అతని రాకతో ఆర్సీబీలో భారీ మార్పు కనిపించకపోయినా.. డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, ఫిన్ అలెన్, మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ ఆర్సీబీకి బ్యాటింగ్‌లో ప్రధాన బలంగా ఉన్నారు. వీరికి రజత్ పటీదార్ కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. గతేడాది పూర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. ఇప్పుడు ఫామ్‌లో ఉండటం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. ఒక్కసారి కోహ్లీ ఫామ్ అందుకుంటే.. ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్సీబీ బ్యాటింగ్ మొత్తాన్ని ఒక్కడే చేయగల సత్తా కోహ్లీది. అతను ఫామ్‌లో ఉండటంతో ఆర్సీబీ కప్‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది.
బౌలింగ్..
జోస్ హెజల్‌వుడ్, మొహమ్మద్ సిరాజ్, వనిందు హసరంగాతో బౌలింగ్ ఎటాక్ కూడా అద్భుతంగా ఉంది. అలాగే ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మెద్ ఆశించిన విధంగా రాణిస్తే.. ఆర్సీబీకి తిరుగుండదు. కానీ ఆ జట్టు మరో స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ దారుణంగా విఫలం అవుతుండటమే ఆర్సీబీని కలవరపెడుతోంది. అతను కూడా ఆశించిన స్థాయిలో రాణిస్తే.. ఆర్సీబీ ఈ సారి అంచనాలకు మించి రాణిస్తుంది.
బలం.. బలహీనత..!
బ్యాటింగ్‌లో కోహ్లీ విఫలమైతే.. జట్టు మొత్తం విఫలం అయినట్లు భావించడం ఆర్సీబీ ప్రధాన బలహీనత. గత రెండు మూడు సీజన్లుగా ఆర్సీబీది ఇదే పరిస్థితి. కానీ ఈ సీజన్‌కు ముందు కోహ్లీ మంచి ఫామ్‌లో ఉండటం ఆర్సీబీకి బలంగా మారింది. పాజిటివ్ థింకింగ్‌తో ఆర్సీబీ మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది. కెప్టెన్సీ విషయంలోనూ ఆర్సీబీకి బెంగలేదు. గతేడాది ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలోనే ప్లే ఆఫ్ వరకు వెళ్లింది. డుప్లెసిస్ కెప్టెన్సీ ఆర్సీబీకి బలంగా కూడా చెప్పవచ్చు. కీలకమైన మ్యాచ్‌ల్లో తడబడటం ఆర్సీబీ ప్రధాన బలహీనత.. దాన్ని అధిగమిస్తే.. ‘ఈ సాలా కప్ నమ్‌దే’ నినాదాన్ని ఆర్సీబీ నిజం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Top moments of RCB Unbox
Lap of Honour, Hall of Fame, Retiring jerseys of AB and Chris, Unveiling the jersey for #IPL2023, practising in front of 20000+ fans, Music Performances and more… #RCBUnbox presented by Walkers and Co. in front of our home crowd was a massive hit! pic.twitter.com/WzvelTzlEe
— Royal Challengers Bangalore (@RCBTweets) March 27, 2023