ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2022ను గెలిచేందుకు టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. అక్కడి లోకల్ టీమ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా మొదలెట్టింది. కానీ.. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుతో లేకపోవడం టీమిండియాకు పెద్దదెబ్బే. వెన్నుగాయం కారణంగా బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. బుమ్రా దూరమైనా.. అతని స్థానంలో మరో పేసర్‌ను బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. వరల్డ్ కప్ టీమ్‌కు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న మరో స్టార్ సీనియర్ బౌలర్ మొహమ్మద్ షమీని బుమ్రా స్థానంలో తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. షమీ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. షమీతో పాటు మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ కూడా బుమ్రా స్థానం కోసం పోటీపడుతున్న వారిలో ఉన్నారు. కానీ.. దీపక్ చాహర్ కూడా ఇటివల గాయంతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమై ఎన్సీఏకు చేరుకున్నాడు. దీంతో రేసులో షమీ, సిరాజ్ మాత్రమే మిగిలారు.
ఒకవేళ షమీనే తీసుకోవాలనుకుంటే ఇప్పటికే షమీ పేరును ప్రకటించేవారు. కానీ.. ఇప్పటి వరకు అలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ సిరాజ్ ఇచ్చిన అద్భుత ప్రదర్శన అతన్ని బుమ్రా స్థానాన్ని భరీ చేయడంలో ముందుకు తీసుకెళ్లింది. సౌతాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ 10 ఓవర్లలో కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. పైగా డెత్ ఓవర్స్‌లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 44, 46, 48, 50వ ఓవర్ వేసిన సిరాజ్ కేవలం వరుసగా.. 5, 4, 6, 3 పరుగులు మాత్రమే ఇచి.. సౌతాఫ్రికాను డెత్‌లో కట్టిపడేశాడు.
సిరాజ్ దెబ్బకి సౌతాఫ్రికా మరో 30 పరుగులు తక్కువ చేసింది. లేదంటే టీమిండియా ముందు 300 పైచిలుకు టార్గెట్ ఉండేది. డెత్ ఓవర్స్‌లో మంచి ఎఫెక్టివ్‌గా ఉండే సిరాజ్ కొత్త బంతితోనూ వికెట్లు అందించగలడు. ఈ క్రమంలో డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం అవ్వడంతో.. అతని స్థానాన్ని సిరాజ్ భర్తీ చేయగలడే నమ్మకం బీసీసీఐకి ఈ ప్రదర్శనతో కలిగినట్టు సమాచారం. అందుకే టీ20 వరల్డ్ కప్ 2022కు బుమ్రా రీప్లేస్‌మెంట్‌గా సిరాజ్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తుంది. పైగా ఆస్ట్రేలియా పిచ్‌లపై సిరాజ్ బౌలింగ్ బాగా పడుతుంది. మంచి పేస్‌ను కూడా జనరేట్ చేయగలడు. మరి మిగిలిన చివరి వన్డేలోనూ సిరాజ్ మంచి ప్రదర్శన ఇస్తే.. ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది.
Terrific spell from Mohammad Siraj. His bowling figure (10-1-38-3). And he bowled 4 overs in 41 to 50th overs. Outstanding spell, Siraj. pic.twitter.com/9FNjXMmKEf
— CricketMAN2 (@ImTanujSingh) October 9, 2022
ఇది కూడా చదవండి: నగ్నంగా గ్రౌండ్లోకి అభిమాని.. కళ్లప్పగించి చూసిన బాబర్ అజమ్