హైపర్ ఆది.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేవి నాన్ స్టాప్ పంచులు. ఒక కమెడియన్ గా కెరీర్ స్టార్ చేసి ఇప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్టు, రైటర్ గా ఎదిగాడు. ఒక హీరోకి ఏమాత్రం తీసిపోకుండా అభిమానులను సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ లో చేస్తూనే.. అటు సినిమాల్లోనూ నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. కమెడియన్‌గా, యాక్టర్‌గా, యాంకర్‌గా కూడా మంచి అవకాశాలను పొందుతున్నాడు. ఇంక షోల విషయానికి వస్తే ఆదిని ఆపేవాళ్లే ఉండరు. ఎదురు ఎవరున్నా తనదైన పంచులతో వారిపై విరుచుకుపడుతూ ఉంటాడు. అయితే అలా నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఆది.. ఒక్కసారిగా స్టేజ్ మీద ఏడ్చేశాడు. అందరూ చూస్తుంటడగానే చిన్నపిల్లాడిలా కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
విషయం ఏంటంటే.. దీపావళి సందర్భంగా స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోలు కూడా యూట్యూబ్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. అందులో పోసాని, యాంకర్ రవి, రష్మీ, ఇంద్రజ, స్నేహా ఇలా అంతా నానా హంగామా చేశారు. షో మొత్తం ధూంధాంగా సాగింది. అయితే చివర్లో హైపర్ ఆదికి ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. అందులో ఆది వాళ్ల అమ్మ వీడియో మెసేజ్ చూపించారు. అందులో ఆది తల్లి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే తనకు మోకాళ్ల నొప్పులు ఉండటం వల్లే హైదరాబాద్ రాలేకపోతున్నానంటూ భావోద్వేగానికి లోనవుతారు. అది చూసిన ఆది తన తల్లి గురించి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయిపోయాడు. గతం గురించి తలుచుకుంటూ నోట మాట రాక ఏడ్చేశాడు. ప్రస్తుతం ఆ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.