తెలుగు రాష్ట్రాల్లో బాగా వివాదంగా మారిన అంశం ఏదైనా ఉందంటే అది ‘మెగాస్టార్ వర్సెస్ గరికపాటి’ వివాదమే. అలయ్ బలయ్ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహారావుల మధ్య చోటు చేసుకున్న సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. మెగాస్టార్ స్థాయి ఏంటి, ఆయన్ని ఉన్నపళంగా ఫోటో సెషన్ ఆపండి అని గరికపాటి అనడం ఏంటి? అహంకారం కాదా అని చాలా మంది విమర్శలు చేశారు. అభిమానులు, చిరంజీవిని అభిమానించే మీడియా ప్రతినిధులు, సినీ కళాకారులు అందరూ గరికపాటిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మెగాబ్రదర్ నాగబాబు, చోటా కె నాయుడు, అనంత శ్రీరామ్, రామ్ గోపాల్ వర్మ ఇలా చాలా మంది ఈ వివాదంపై స్పందించారు.
తాజాగా ఈ వివాదంపై మంచు విష్ణు స్పందించారు. అక్టోబర్ 21న జిన్నా మూవీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా.. మంచు విష్ణు మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన గరికపాటి వివాదంపై స్పందించారు. “ఏం జరిగిందో తనకు కరెక్ట్ గా తెలియదని, అయితే చిరంజీవితో ఫోటో తీసుకోవడం అనేది ఫ్యాన్స్ కి ఒక సువర్ణావకాశం లాంటిదని అన్నారు. చిరంజీవి ఒక లెజెండ్ అని, ఆయన దగ్గరకి ఎవరైనా సరే పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోటో తీసుకుంటారు. అది సహజ విషయం అని అన్నారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ అంత పెద్ద స్టార్స్ ఉండేటప్పుడు అభిమానులు ఉత్సాహంగా ఉంటారు, అభిమానుల ఆతురతని ఎవరూ ఆపలేరని మంచు విష్ణు కామెంట్స్ చేశారు. చిరంజీవిని సపోర్ట్ చేస్తూ మంచు విష్ణు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.