ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోల్స్ తో పాటు సినీ సెలబ్రిటీల నుండి విమర్శలు ఫేస్ చేస్తున్న ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. అయితే.. గరికపాటి కామెంట్స్ పై రెండు తెలుగు రాష్ట్రాలలోని మెగాఫ్యాన్స్ తో పాటు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తీవ్రమైన విమర్శలు గుప్పించాడు. తాజాగా గరికపాటిపై విమర్శలతో బరిలోకి దిగిపోయాడు బాబు గోగినేని. వర్మ ట్వీట్స్ తోనే దుమారం మొదలయిందని అనుకునేలోపు ఇప్పుడు బాబు గోగినేని ఎంటర్ అవ్వడంతో టార్గెట్ చేసాడేమో అనే సందేహాలు బయటికి వచ్చాయి.
ఇక గరికపాటి వివాదంపై ఆల్రెడీ మెగాస్టార్ క్లారిటీ ఇచ్చేశారు. గరికపాటి పెద్దవారు ఆయన వ్యాఖ్యలపై చర్చలు జరపడం కరెక్ట్ కాదని కూడా తేల్చేశారు. ఈ క్రమంలో గరికపాటిపై బాబు గోగినేని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కొంతమంది వరకు గరికపాటికి పాజిటివ్ సపోర్ట్ అందిస్తుండగా.. తనదైన శైలిలో విమర్శిస్తూ రేసులోకి ఎంటర్ అయిపోయాడు గోగినేని. దీంతో మహిళలపై.. అత్యాచారాలపై గరికపాటి గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తన అభిప్రాయాలు బయటపెట్టాడు. అనుష్కను చూస్తుంటే గుండె దడదడలాడుతుందన్న మాటలు ఒంటికి రుచించవని గోగినేని తెలిపాడు.
అంతేగాక తనకు గరికపాటి తెలుగు తాలిబన్ లాగా కనిపిస్తున్నారని షాకింగ్ కామెంట్ చేయడం గమనార్హం. మహిళలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినందుకు గరికపాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు గోగినేని తెలిపారు. ఆయన ఆల్బర్ట్ ఐన్ స్టీన్ పేరును కూడా సరిగ్గా పలకలేని గరికపాటి.. శాస్త్రీయ సిద్ధాంతాల గురించి లెక్చర్లు బాగానే ఇస్తుంటాడని గోగినేని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే.. చిరు క్లారిటీ ఇవ్వడంతోనే ముగిసిందని అనుకుంటున్న వివాదాన్ని బాబు గోగినేని మళ్లీ నిప్పు రాజేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి బాబు గోగినేని సోషల్ మీడియా పోస్ట్ ఎలాంటి వివాదానికి తెరలేపనుందో!