పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు వెండి తెరపై అందాలు ఆరబోసి కుర్రాళ్ల మదిలో నిద్రపోయింది ఈ పంజాబీ భామ. స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మాయాజాలం’ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాల్లో అరుదుగా కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అప్పుడప్పుడు పూనమ్ కి నెటిజన్ల నుంచి ట్రోల్స్ కూడా వస్తుంటాయి. తాజాగా ఈ పంజాబీ బ్యూటీ ‘కర్వాచౌత్’ పండగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ.. జల్లెడ పట్టుకుని ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోపై కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ‘కర్వాచౌత్’ వేడుకను పెళ్లైన మహిళలు జరుపుకుంటారు. మరి నీకు పెళ్లైందా? పూనమ్ కౌర్” అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. వారి ట్రోల్స్ కి పూనమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
కర్వాచౌత్ వేడుక అనేది ఉత్తర భారతదేశం స్త్రీలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రధానంగా పెళ్లైన మహిళలు పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి, పార్వతీదేవిని పూజిస్తూ.. రాత్రి జల్లెడలో చంద్రున్ని చూసి.. అదే జల్లెడలో నుంచి భర్త మెుహాన్ని చూస్తారు. అనంతరం భర్త కాళ్లకు నమష్కరించి.. ఆశీర్వాదాన్ని పొందుతారు. ‘కర్వాచౌత్’ ను పెళ్లి కాని స్త్రీలు తమకు కాబోయే భర్తతో కలిసి ఈ వేడుకను జరుపుకుంటారు. భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే పూనమ్ కూడా జల్లెడ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న పిక్ ను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఆ పిక్ నెటింట్లో తెగ వైరల్ అయింది. దీంతో కొందరు నెటిజన్లు పూనమ్ పై తెగ ట్రోల్స్ చేశారు.’పూనమ్ ఈ వేడుకను పెళ్లి అయిన యువతులే నిర్వహిస్తారు.. లేదా కాబోయే వాడితో జరుపుకుంటారు.
మరి మీరెందుకు చేసుకుంటున్నారు? మీకు పెళ్లి కుదిరిందా?, చంద్రుడిని చూసిన అనంతరం మీరు ఎవరి ముఖాన్ని చూస్తారు?’ అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే వారికి ట్రోల్స్ కి పూనమ్ కౌర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.”ఈ ఆర్టికల్స్ రాజకీయంగా ప్రేరేపించబడ్డాయో లేక వేరే ఆలోచనలతో సంధించబడ్డాయో నాకు తెలియదు. కానీ కర్వాచౌత్ ను పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరపుకోవచ్చు. కాబోయే భర్త కోసం పెళ్లి కాని మహిళలు ఈ పండగను నిర్వహించుకుంటారు. పెళ్లైన వాళ్లు చంద్రుని ఆరాధిస్తే, పెళ్లికాని అమ్మాయిలు చుక్కలను ఆరాధిస్తారు. అదే సమయంలో ఈశ్వరుడిని కూడా కొలుస్తారు” అని చెప్పుకొచ్చింది.
I don’t know if the articles revolving around today are politically motivated or motivated by missionaries way of thinking – educate yourself – #omnamahshivya ( vasudeva Kutumbakam is what u need to learn . pic.twitter.com/BlQ1mq0qHJ
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 14, 2022
Happy #KarwaChauth pic.twitter.com/3LrqSCRmWg
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 13, 2022