సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటారు. బోల్డ్ ఫోటోలు, మోడ్రన్ అవుట్ ఫిట్స్ తో దిగిన ఫోటోలు, స్టైలిష్ ఫోటోషూట్స్ తో అదరగొడుతుంటుంది.
తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొన్ననే 4 రోజుల క్రితం నారింజ రంగు గౌనులో తళుక్కున మెరిసే ఫోటోలను అప్ లోడ్ చేసింది. ఇంకా ఆ మెరుపు షాక్ లోంచి కోలుకోలేదు. మళ్ళీ ఇంకో మెరుపు లాంటి ఫోటోలను అప్ లోడ్ చేసింది.
ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న ఫోటోలను షేర్ చేసింది. పాల బుగ్గలు వేసుకుని, నవ్వితే పెదాల కొన అంచులు గులాబీ పువ్వులా విచ్చుకుని, బొద్దుగా కనిపిస్తూ..
ఆకట్టుకునే అందంతో గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉంటే బాగుంటుంది అనిపించేంత అందంగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఏంజెల్ లా కనిపిస్తోంది.
‘అతిలోక సుందరి.. అతిలోక సుందరి.. తొలి చూపుకే పడిపోయానే మరి’ అంటూ కొన్ని వేల యువ హృదయాలు ఈ పాటను హమ్ చేస్తా ఉంటాయి. అంత అందంగా, దేవకన్యలా మెరిసిపోతుంది.
అప్సరస అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని అనుకుంటే ఈ అందాల రాశినే పెడతారేమో అనేంత అందంగా ఉంది. ఈ ఫోటో చూస్తుంటే రాశి ఖన్నా మనకి ఏదో చెప్తోంది. ‘హే నా మొఖానికి ఏదో అంటుకున్నట్టు లేదూ. చూసి చెప్పండి’ అని రాశి ఫోటో మాట్లాడుతుంది.
ఆమె మొఖానికి అంటుకుంది అందం అని ఆమెకూ తెలుసు, మనకీ తెలుసు. యువరాణిలా ఎంత అందంగా ఉందో. అందాల రాశి నవ్వితే.. ఆ బుగ్గలు రెండూ భలే ఉబ్బుతాయి. ఆ నవ్వులో ఏదో మ్యాజిక్ ఉంది భయ్యా.