‘ఆదిపురుష్’ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా సినిమా వస్తోంది అని టాక్ విన్న దగ్గర్నించి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశంలోని సినిమా ప్రేక్షకులు అంతా ఆ సినిమా కోసం ఎదురు చూశారు. చాలా వెయిట్ చేయించిన తర్వాత ఈ సినిమా నుంచి ఒక అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే సినిమా టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ చూశాక ప్రేక్షకులకు కాసేపు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ప్రభాస్ సినిమా అన్నారు. కానీ, అక్కడ చూస్తుంటే యానిమేషన్ ప్రభాస్ ఉన్నాడు అంటూ బుర్ర గోక్కున్నారు. ఆ టీజర్ మీద జరిగిన ట్రోల్స్ అన్నీ ఇన్నీ కాదు. కార్టూన్ సినిమా అని, యానిమేషన్ సినిమా అంటూ గోల చేశారు. అంతేకాకుండా రాముడు, రావణుడు, హనుమంతుడు గెటప్ల మీద భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ విమర్శలపై సినిమా బృందం కూడా స్పందించింది. ఈ సినిమాట టీజర్‌ని 3డీలో చూడాలంటూ సూచించింది. 20 రోజుల్లోగా మరో టీజర్ విడుదల చేస్తామని.. తప్పకుండా ప్రేక్షకుల అభిప్రాయం మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ టీజర్‌పై రెండ్రోజులుగా టాక్ మారింది. 3డీ, థియేటర్లలో టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. 3డీలో సినిమా టీజర్ అద్భుతంగా ఉందని, థియేటర్ ఎక్స్ పీరియన్స్ నెక్ట్స్ లెవల్లో ఉందని చెబుతున్నారు. ఈ అంశంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదిపురుష్ టీజర్‌పై తన అభిప్రాయాన్ని, వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడారు.
“ఆదిపురుష్ ట్రైలర్ చూశాను. ప్రభాస్ సినిమా అంటే వాడి వేడిగా ఉంటుంది. పైగా రూ.500 కోట్ల బడ్జెట్ ముంబైలో చేస్తున్నారు అని చెబుతున్నారు. కానీ, ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలా డిజప్పాయింట్‌గా అనిపించింది. యానిమేషన్ సినిమాలా అనిపించింది. దీనిపై ట్రోలింగ్ కూడా నడిచింది. ప్రెస్‌మీట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో సినిమాని 3డీలో చూడాలని చెబుతున్నారు. 3డీ అయినా 4డీ అయినా యానిమేషన్‌కి లైవ్‌కి తేడా ఉంటుంది. 3డీలో పక్షులు, రాక్షసులు మీదకు వచ్చినట్లు కనిపిస్తుంది. జనం గోల ఏంటంటే అది యానిమేషన్ సినిమాలాగా ఉందని. రజినీకాంత్ తీసిన కొచ్చాడియన్‌లా ఉందని. రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్ల మీద కూడా చాలా ట్రోలింగ్ నడిచింది. రాముడిని దేవడిగా కొలిచే దేశంలో ఆయన గెటప్‌ని మార్చేయడం విచిత్రంగా ఉంది. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు. ఆయనకు కూడా దేవాలయాలు ఉన్నాయి. 20 రోజుల్లో అంతా మారిపోతుంది అంటున్నారు. నిజంగా ఆ రిపేర్లు ఏవో చక్కగా చేస్తే మంచిదే. సినిమా మంచిగా రావాలనే ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాని అల్లరి చేయాలని చేయడం లేదు. ఆదిపురుష్ సినిమాకి ఆల్ ది బెస్ట్” తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.