టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రిన్స్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య కారణంగా ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో మహేష్ బాబు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆవిడ అకాల మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇందిరా దేవి మరణవార్త తెలియగానే ట్విట్టర్ వేదికగా స్పందించారు. చాలా మంది ప్రముఖులు కృష్ణ, మహేష్ బాబులకు తమ సంతాపం వ్యక్తం చేశారు. అయితే కొందరు సెలబ్రిటీలు వివిధ కారణాలతో ఇందిరాదేవి కడసారి చూసేందుకు రాలేపోయారు. తాజాగా నందమూరి బాలకృష్ణ వెళ్లి మహేష్ బాబును కలిశారు.
మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి పది రోజుల కిందట పరమపదించిన సంగతి తెలిసిందే. అప్పుడు చిత్ర పరిశ్రమ నుండి చాలామంది వ్యక్తిగతంగా వచ్చి, మహేష్ బాబు కి, కి తమ సంతాపం వ్యక్త పరిచారు. అయితే ఆ సమయంలో షూటింగ్ కారణంగా బాలయ్య టర్కీలో ఉండిపోయారు. దీంతో ఆసమయంలో మహేష్ బాబుని కలవటానికి బాలయ్యకి కుదరలేదు. శనివారం ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో ఇందిరా దేవికి 11వ రోజు కర్మ చేశారు. దానికి కృష్ణ కుటుంబానికి బాగా పరిచయం వున్న ప్రముఖులను పిలిచినట్టు సమాచారం. అందులో బాలకృష్ణ కూడా వున్నారు. దీంతో ఆ కార్యక్రమానికి వెళ్లిన బాలకృష్ణ.. కృష్ణని, మహేష్ బాబుని పరామర్శించి తన సానుభూతిని వ్యక్తపరిచారని సమాచారం. కృష్ణ తో పలు సినిమాలు చేసిన రంజిత్ ఫిలిమ్స్ కానూరి దామోదర ప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే చిత్ర పరిశ్రమ నుండి మరి కొంతమంది కుటుంబాలతో హాజరు అయినట్టుగా తెలిసింది. మహేష్, కృష్ణ కుటుంబం కూడా ఈ 11వ రోజు కర్మకి హాజరు అయినట్టు తెలిసింది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. మళ్ళీ సోమవారం నుండి సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం.
#NandamuriBalakrishna garu has attended the 11th-day ceremony of #Indiramma garu and consoled Superstar #Krishna garu, @urstrulyMahesh and Family!#MaheshBabu #NBK #SSMB #RIPIndiraDeviGaru #TeluguFilmNagar pic.twitter.com/YGh33modrZ
— Telugu FilmNagar (@telugufilmnagar) October 8, 2022