బాలీవుడ్ నటి అనన్య పాండే గురువారం ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆర్యన్ ఖాన్‌తో డ్రగ్స్ విషయమై ఆమె చాటింగ్ చేసినట్లు ఎన్సీబీ పోలీసులు గుర్తించి ఆమె నివాసాన్ని సోదా చేశారు. అనన్య ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుఖ్‌ఖాన్ కొడుకు ఆర్యన్‌ఖాన్ ఫోన్‌ను పరిశీలించగా అనన్య పాండేకు ఆర్యన్‌కు మధ్య డ్రగ్స్ కోసం వాట్సప్ చాట్ జరిగిందని ఎన్సీబీ అధికారులు తెలియజేశారు. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు పూరి జగన్నాథ్‌కు తలనొప్పిగా మారింది.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్ సాలా క్రాస్ బీడ్’ అనే సినిమాలో అనన్య పాండే హీరోయిన్. ఇప్పుడు అనన్య ఈ డ్రగ్స్ కేసులో పూర్తిగా ఇరుక్కుంటే లైగర్ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడే అవకాశం ఉంది. లైగర్‌లో ప్రపంచ దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ఒక పాత్ర చేయనున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది. ఇండియన్ సినిమాలో టైసన్ నటించడం ఇదే మొదటిసారి. అందుకే ఆయన పాత్రను పూరి చాలా కేర్ తీసుకుని స్పెషల్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.
ఆయనతో షూట్ కోసం డేట్లు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు అనన్య ఈష్యూతో షూటింగ్‌కు ఇబ్బంది కలిగితే టైసన్ డేట్లు మళ్లీ తీసుకోవడం కష్టం. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అందుకే అనన్య డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆయన ఆందోళన చెందుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
ఇదీ చదవండి: పూరికి బర్త్ డే విషెస్, ధాంక్స్ చెబుతుందేమో ఛార్మీ.. అసలేంటి విషయం