రాఖీ పూర్ణిమ సందర్భంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ళు ఉన్న ఇళ్ళలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ విషయంలో సాధారణ జనమే కాదు, సినిమా సెలబ్రిటీలు సైతం ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. తోడబుట్టిన సోదరులకి రాఖీలు కట్టి బహుమతిగా ఏదో ఒకటి పొందడం అనేది ఆనవాయితీగా వస్తున్నా ఆచారం. అలా తోడబుట్టిన అక్కకి లేదా చెల్లెలికి బహుమతిగా చీర లేదా ఇంకేదైనా విలువైన వస్తువు ఇస్తే మంచిదని సోదరులు భావిస్తుంటారు. తాజాగా సింగర్ మంగ్లీ కూడా నితిన్ కి రాఖీ కట్టి మంచి బహుమతిని అందుకున్నారు.
నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టు 12న రిలీజ్ అవుతున్న సందర్భంగా మూవీ యూనిట్ రక్షాబంధన్ స్పెషల్ చిట్ చాట్ ను నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో నితిన్ తో పాటు ఆయన సోదరి నిఖిత రెడ్డి, సింగర్ మంగ్లీ పాల్గొన్నారు. చిట్ చాట్ లో మూవీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు. చిట్ చాట్ ముగిసే సమయానికి నిఖిత రెడ్డి.. నితిన్ చేతికి రాఖీ కట్టి హారతి ఇచ్చారు. నితిన్ కి నుదిట బొట్టు పెట్టి, అక్షింతలు వేసి దీవించిన అక్క కాళ్ళకు నితిన్ నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆ తర్వాత సింగర్ మంగ్లీ కూడా నితిన్ కి బొట్టు పెట్టి, చేతికి రాఖీ కట్టారు. ఆ తర్వాత స్వీట్ తినిపించి.. హారతి ఇచ్చారు. దీంతో నితిన్ సంతోషించి.. మంగ్లీకి బహుమతి ఇచ్చారు. అందులో స్వీట్ బాక్స్ తో పాటు చీర ప్యాక్ చేసి ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు మరొక బాక్స్ కూడా కనబడుతోంది. అందులో కూడా విలువైన వస్తువు ఏదో ఒకటి ఉంటుందనిపిస్తుంది. మొత్తానికి ఈ రాఖీ పండుగకి అన్న నితిన్ నుండి మంచి ఖరీదైన బహుమతి అయితే పొందారు సింగర్ మంగ్లీ. మరి రాఖీ కట్టిన చెల్లెలికి బహుమతి ఇచ్చిన నితిన్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.