ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు వాళ్లందరికీ ఒక ఎమోషన్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి ఎక్కువ సమయం స్క్రీన్ ని పంచుకున్నారు. సినిమా చూస్తున్నంత సేపూ రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ముల్లా ఆ అనుబంధాన్ని తెరపై రక్తికట్టించారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో కళ్ళ నుంచి నీళ్లు తెప్పించారు. అంతేనా నవ్వించారు, కథతో పాటు నడిపించారు, మనతోనీ నవరసాలు పండించారు. నాటు నాటు పాటకు కలిసి స్టెప్పులు వేస్తూ నరనరాల్లో జీవం పోశారు. కుర్చీల్లోంచి లేచి నిలబడి డ్యాన్స్ వేసేంతగా మనల్ని ఉర్రూతలూగించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మాత్రమే కాదు.. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన వారిది, పాట రాసిన రచయితది, అద్భుతమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడిది, దాన్ని అత్యంత అద్భుతంగా ఆలపించిన సింగర్స్ ది. వీరందరి శ్రమ ఫలితమే ఆస్కార్ అవార్డు. ప్రతి తెలుగు వారూ ఎదురుచూస్తున్న అత్యంత అద్భుతమైన ఘట్టం ఎట్టకేలకు వచ్చేసింది.
తెలుగు చిత్రానికి గుర్తింపు లేదు అని ఒక వెలితి, బాధ ఉండేది. అయితే బాహుబలి. ఆర్ఆర్ఆర్ సినిమాల పుణ్యమా అని ఆ లోటు తీరిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమా అంటే భారతీయ సినిమా అనే స్థాయికి ఎదిగింది. బాహుబలి సినిమా రాజమౌళిలోని అసలైన దర్శక ధీరుడ్ని ప్రపంచానికి పరిచయం చేస్తే ఆర్ఆర్ఆర్ సినిమా వంద రాజమౌళిలు కలిస్తే ఎలా ఉంటుందో నిరూపించింది. ఇద్దరు తెలుగు హీరోల నట వైభవాన్ని, నట విశ్వరూపాన్ని ఈ చిత్రం ప్రపంచానికి పరిచయం చేసింది. రామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకులను, దిగ్గజ నటులను సైతం మెప్పించేలా ఆర్ఆర్ఆర్ సినిమాని తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ముఖ్యంగా నాటు నాటు పాట అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఉర్రూతలూగించింది.
ఎం.ఎం. కీరవాణి సంగీతం, చంద్రబోస్ కలం నుంచి జాలువారిన జానపదాలు, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవల గాత్రం కలిసి ఒక అమృతం లాంటి పాట బయటకొచ్చింది. దానికి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ, చరణ్, ఎన్టీఆర్ ల మాస్ డ్యాన్స్ తోడై ఈ మాస్ పాటను అందలం ఎక్కించింది. ప్రపంచం మొత్తం ఈ పాటను మెచ్చేలా మన వాళ్ళు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆస్కార్ రేసులో ఇంగ్లీష్ పాటలకు పోటీగా మన తెలుగు నాటు పాట నిలబడింది. ఎంతగానో ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల ఉత్సవం వచ్చేసింది. ఆస్కార్స్ 2023 మహోత్సవం మార్చి 12న లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ అంటే మార్చి 13న ఉదయం 5.30 గంటలకు అవార్డుల కార్యక్రమ ప్రసారం ప్రారంభమైంది.
ఈ అవార్డు ఉత్సవంలో మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ కు చోటు దక్కడం అనేది యావత్ భారతదేశానికే ఒక పెద్ద సెలబ్రేషన్. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ లో చోటు దక్కింది. మన తెలుగు పాటకు పోటీగా అప్లాజ్, హోల్డ్ మై హ్యాండ్, లిఫ్ట్ మి అప్, థిస్ ఈజ్ ఏ లైఫ్ వంటి పాటలు ఉన్నాయి. వాటన్నిటినీ దాటుకుని మన తెలుగు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఇప్పటికే నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజగా ఆస్కార్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది.
ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాటను ఆలపించారు. ఇక అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ అరుదైన ఘట్టం ఎట్టకేలకు వచ్చేసింది. కీరవాణి, చంద్రబోస్ అవార్డు అందుకున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఆస్కార్ అవార్డు అందుకున్న మన తెలుగోళ్ళపై మీ అభిప్రాయమేమిటి? నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
PROUD MOMENT FOR OUR TELUGU CINEMA 💪🔥🕺🏼#OscarForNaatuNaatu @RRRMovie pic.twitter.com/ILkPAhRAbN
— SumanTV (@SumanTvOfficial) March 13, 2023
#NaatuNaatu live performance at the Oscars Stage Got a massive response and a standing ovation.🌟✨🔥🙏#NaatuNaatuForOscars 💪😍 @RRRMovie pic.twitter.com/ePS5wfwSXo
— SumanTV (@SumanTvOfficial) March 13, 2023