పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. అయితే కొంతమందికి ఈ టీజర్ నచ్చలేదు. పూర్ గ్రాఫిక్స్, పూర్ విజువల్స్ అని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కార్టూన్ సినిమాని చూసినట్టే ఉందని అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. తాజాగా ఈ టీజర్ పై మంచు విష్ణు చేసిన నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్ ని అత్యంత సన్నిహితుడిగా భావించే మంచు విష్ణు.. ప్రభాస్ మీద, ప్రభాస్ సినిమా మీద కామెంట్స్ చేయడం ఏంటి? ప్రభాస్ చేతిలో మోసపోయినట్టే భావిస్తున్నానని మంచు విష్ణు అనడం ఏమిటి? ఆదిపురుష్ సినిమాలో విజువల్స్ కార్టూన్ సినిమా చూసినట్టే ఉన్నాయని అనడం ఏమిటి? ఆదిపురుష్ పై మంచు విష్ణు చేసిన నెగిటివ్ కామెంట్సే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
“ఆదిపురుష్ మేకర్స్ మరియు ప్రభాస్ చేతిలో మోసపోయినట్టు నేను భావిస్తున్నాను. మీరు ముందుగానే ప్రేక్షకులను ప్రిపేర్ చేయవలసింది. ఆదిపురుష్ విజువల్స్ కార్టూనిష్ గా ఉన్నాయి. మీరు ముందుగానే ప్రిపేర్ చేయకుండా.. ప్రేక్షకులను మోసం చేయాలనుకుంటే ఇదిగో రియాక్షన్ ఇలానే ఉంటుంది” అని మంచు విష్ణు ఆదిపురుష్ టీజర్ పై కామెంట్స్ చేసినట్టు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయ్యింది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా మంచు విష్ణు ఇలా కామెంట్స్ చేశారంటూ వార్తలు వచ్చాయి. అది కాస్తా వివాదంగా మారింది. మంచు విష్ణు.. ప్రభాస్ విషయంలో ఇలా అనడం ఏమిటని కొందరు మంచు విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచు విష్ణుని టార్గెట్ చేశారు. ఇది మంచు విష్ణు దృష్టికి వెళ్లడంతో ఆయన రంగంలోకి దిగారు.
“ఓరి బాబు ప్రభాస్ ని నేనెందుకు అలా అంటాను” అనే విషయం అందరికీ తెలిసేలా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. “ఇదంతా ఫేక్ న్యూస్! ఊహించినట్టుగానే.. జిన్నా రిలీజ్ కి ముందు ఎవరో ఐటం రాజా నెగిటివ్ న్యూస్ ని వ్యాప్తి చేస్తున్నారు. నాకు ఏమీ వద్దు. కానీ నా డార్లింగ్ బ్రదర్ ప్రభాస్ కి బెస్ట్ గా ఉంటే చాలు” అంటూ ట్వీట్ చేశారు. మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 21న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే కొంతమంది ఔత్సాహికులు ఆయన అనని మాటలను కూడా అన్నట్టు రాసేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. అదన్నమాట విషయం.
Fake News! As expected, some item raja trying to spread negative news just before #Ginna release 🙄
I want nothing but the best for my darling brother Prabhas. ❤️✊🏽 pic.twitter.com/Aa13Vw9XsK
— Vishnu Manchu (@iVishnuManchu) October 15, 2022