డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఆయన మీద వస్తున్న రూమర్స్ ఏంటి? ప్రభాస్, కృతిసనన్ తో డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ లో కథనాలు రాసేస్తున్నారు. రెండు రోజుల నుంచి ఇదే వార్త అటు తిప్పి ఇటు తిప్పి తెగ నాంచుతున్నారు. అసలే ప్రభాస్ పెద నాన్న కృష్ణంరాజు మరణంతో తీవ్ర దుఃఖంలో ఉంటే.. ఇప్పుడు హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రభాస్, కృతిసనన్ ఇద్దరూ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని బాలీవుడ్ మీడియా బ్రాయిలర్ కోడై కూస్తోంది. 2020లో ఆదిపురుష్ సినిమా స్టార్ట్ అయ్యింది. ఇందులో సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోంది.
ఇప్పుడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధం కాబోతుంది. ఈ క్రమంలో ప్రభాస్, కృతిసనన్ ల మధ్య ఎఫైర్ ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. మామూలుగా ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే బాలీవుడ్ లో హీరో, హీరోయిన్ మధ్య ఎఫైర్ ఉందని న్యూస్ రాయడం అక్కడ మీడియాకి అలవాటే. సినిమా ప్రమోషన్ లో భాగంగా అలా చేస్తారో లేక వార్తల కోసం అలా రాస్తారో తెలియదు గానీ రాంగ్ టైంలో రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూలై 27న కృతిసనన్ పుట్టినరోజు నాడు ప్రభాస్ విష్ చేయడం కూడా ఇద్దరి మధ్య సమ్ థింగ్ అన్న రూమర్స్ కి ఆద్యం పోసినట్లయింది. అసలు ప్రభాస్ తన సినిమా అప్ డేట్స్ తప్పితే మిగతా వాటి గురించి పెద్దగా పట్టించుకోరు.
Adipurush stars Prabhas-Kriti Sanon dating? Here’s a look at their earlier rumoured relationships
#Adipurush #EntertainmentNews #KritiSanon #Prabhas
https://t.co/GU4YfPXt5a— Bollywood Life (@bollywood_life) September 19, 2022
ప్రముఖ షోలో ప్రభాస్ కు ప్రాంక్ కాల్ చేసిన కృతిసనన్!
అలాంటిది కృతిసనన్ కి ప్రత్యేకించి సోషల్ బర్త్ డే విషెస్ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. దీనికి తోడు కృతిసనన్ కూడా ఒక షోలో ప్రభాస్ కి కాల్ చేసింది. దీంతో ఇద్దరూ రహస్యంగా రిలేషన్ షిప్ ని మెయిన్టెయిన్ చేస్తున్నారని కథలు అల్లేశారు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న కృతిసనన్.. షోలో ఉండగా ప్రభాస్ కి కాల్ చేయడమే ఈ రూమర్స్ కి కారణం. బాలీవుడ్ లో అంతమంది హీరోలు ఉండగా ప్రభాస్ కే ఎందుకు కాల్ చేయాలని బాలీవుడ్డోళ్లు బాగా ఆలోచించి ఇద్దరి మధ్య డ్యాష్ డ్యాష్ అని ఎఫైర్ అంటగలిపేశారు.
ఆ టైంలో ప్రభాస్ కి కాల్ చేయడం అనేది మూవీ ప్రమోషన్ లో భాగం అయి ఉండచ్చు. లేదా ప్రభాస్ జెన్యూన్ స్నేహితుడై ఉండచ్చు. అంతమాత్రాన కృతిసనన్ కి, ప్రభాస్ కి లింక్ పెట్టి రాయడం అన్నది ఎంత వరకూ కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అది కూడా ప్రభాస్ ఇప్పుడున్న పరిస్థితిని అర్ధం చేసుకోకుండా ఇలా రూమర్లు స్ప్రెడ్ చేయడం ఏంటని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరి ఈ వార్తలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
.@kritisanon called #Prabhas in koffee with Karan show 🤩👌pic.twitter.com/Cwt7eOjpxK
— Nizam REBEL’lions ™ 🏹 (@NizamPrabhasFC) September 1, 2022