సినీ ఇండస్ర్టీలో నటులైనా, టెక్నీషియన్స్ అయినా గుర్తింపు తెచ్చుకొని సెలబ్రిటీలు అనిపించుకుంటేగాని జనాలు వాళ్ళను గుర్తించరు. కొందరికి కొంతకాలానికే గుర్తింపు లభిస్తే, మరికొందరికి కొన్నేళ్లు గడిచినా ఎదురుచూపులు తప్పవు. అయితే.. చిన్నప్పటి నుండే సినిమాలంటే పిచ్చితో నటి కావాలని నిర్ణయించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుమ్మడి జయవాణి.. చదువుకునే టైంలోనే పెళ్లి చేసుకొని ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. సినిమాల్లోకి రావడానికి జయవాణి ఫ్యామిలీ నిరాకరించినా, పెళ్లి తర్వాత భర్త సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి రాగలిగింది. మొదటగా సీరియల్స్ లో నటించిన జయవాణి.. చిన్న చిన్న క్యారెక్టర్స్ ద్వారా సినిమాలలో అడుగుపెట్టింది.
ఇక కొంచం మసాలా కలగలిపిన చిన్న చిన్న పాత్రలతో పాపులర్ అయిన జయవాణికి.. విక్రమార్కుడు, యమదొంగ, మహాత్మా, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. అయితే.. ఇండస్ట్రీ అన్నాక అందరి కెరీర్ లోనూ ఒడిదుడుకులు, సంతోషకరమైన సందర్భాలు ఎన్నో కొన్ని ఉంటాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయవాణి.. తాను ఏదైనా క్యారెక్టర్ లో ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే అందులోనుండి బయటికి అంత తొందరగా రాలేనని చెప్పింది. అదీగాక క్యారెక్టర్ లోకి దిగాక.. తాను ఏం జరిగినా పట్టించుకోకుండా క్యారెక్టర్ లో చెలరేగిపోతానని చెబుతూ.. గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంది.
జయవాణి మాట్లాడుతూ.. ‘అదిరిందయ్యా చంద్రం సినిమాలో వేణు మాధవ్ రోడ్డుపై తాగిపడిపోతే.. అతన్ని లేపి ఇంటికి తీసుకెళ్లే సీన్ చేస్తున్నాం. డైరెక్టర్ వచ్చి అలా ఇలా అని చెప్పి, రిహార్సల్ చేయించారు. అయితే.. రిహార్సల్స్ లో కేవలం డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. తీరా కెమెరా ఆన్ అయ్యి యాక్షన్ అనగానే.. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి వేణుమాధవ్ ని కాలితో తన్నుతూ తీసుకెళ్ళాను. ఆ సీన్ టేక్ ఓకే అయిపోయింది. కానీ.. డైరెక్టర్ టెన్షన్ పడుతూ వచ్చి, అలా తన్నేశావ్ ఏంటి? సీన్ లో అది లేదుకదా.. వేణుమాధవ్ మధ్యలో వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి అన్నారు. అప్పుడే వేణుమాధవ్ వచ్చి సీన్ చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. అప్పుడు నేను హమ్మయ్య అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జయవాణి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి జయవాణి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.