ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ప్రేమ, పెళ్లి విషయాలలో వయసు పరంగా ఎలాంటి తారతమ్యాలు చూడట్లేదు. ఇటీవలే కోలీవుడ్ లో నిర్మాత రవీందర్, సీరియల్ ఆర్టిస్ట్ వీజే మహాలక్ష్మిలు లవ్ మ్యారేజ్ చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రవీందర్, మహాలక్ష్మిల పెళ్లి టాపిక్ ఇండస్ట్రీలో కొన్ని రోజులపాటు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అందులోనూ ఇద్దరికీ రెండో పెళ్లి కావడం విశేషం. అయితే.. పర్సనాలిటీ పరంగా రవీందర్ భారీకాయం కలిగి ఉండటం, మహాలక్ష్మి హీరోయిన్ లా ఉండటంతో ఈ జంట వార్తల్లోకెక్కి హైలైట్ అవ్వడం చూశాం. తాజాగా రవీందర్, మహాలక్ష్మి హనీమూన్ ట్రిప్ కి వెళ్లారు.
ఈ క్రమంలో రవీందర్, మహాలక్ష్మిలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. అయినా అవేం పట్టించుకోకుండా ఈ జంట రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత రవీందర్, మహాలక్ష్మి తమ కులదైవాన్ని కూడా దర్శించుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ హనీమూన్ కి వెళ్లడంతో అక్కడ ఎయిర్ పోర్టులో తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రవీందర్, మహాలక్ష్మి హనీమూన్ కోసం ప్రైవేట్ ఫ్లైట్ లో సెంట్రల్ అమెరికాలోని బెలిజ్ సిటీకి చేరుకున్నారు. అక్కడే ఓ పాపులర్ హోటల్ లో దిగిన ఫోటోలు సైతం వారు పోస్ట్ చేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న రవీందర్, మహాలక్ష్మిలపై మొదటి నుండి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు రవీందర్ పర్సనాలిటీ చూసి కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మహాలక్ష్మి అతన్ని ఎలా ప్రేమించిందంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే.. తమపై వచ్చిన ట్రోల్స్ పై ఇటీవలే స్పందించిన మహాలక్ష్మి.. తమ జంట గురించి ఎవరూ తప్పుగా కామెంట్ చేయొద్దని రిక్వెస్ట్ చేసింది. అయినా ఇప్పుడు హనీమూన్ అనేసరికి సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం మళ్లీ మొదలైంది. కానీ.. ఈ జంట మాత్రం ఆనందంగా హనీమూన్, మ్యారేజ్ లైఫ్ లీడ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి రవీందర్, మహాలక్ష్మిల జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.