బుల్లితెర టీవీ ప్రసారాలలో చాలా షోలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పలు షోలల్లో సెలబ్రిటీలకు ప్రాంక్ కాల్ చేయాల్సిందిగా అక్కడి యాంకర్స్ చెబుతారు. దాంతో వారు తమకు దగ్గరైన వారికి కాల్ చేసి పాయింట్లు సంపాదిస్తారు. ఇలాంటి గేమ్ నే తాజాగా ప్రముఖ షో అయిన కాఫీ విత్ కరణ్ లో కరణ్ జోహార్ ఆడించారు. ఈ ఎపీసోడ్ కు హీరోయిన్ కృతి సనన్, హీరో టైగర్ ష్రాఫ్ వచ్చారు. అయితే కృతి గేమ్ లో భాగంగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోకి కాల్ చేసింది. మరి ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కాఫీ విత్ కరణ్.. ఈ పేరు వింటేనే చాలు అశ్లీల ప్రశ్నలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పేస్తారు ప్రేక్షకులు. కరణ్ ఏకంగా బెడ్ రూం విషయాలనే టార్గెట్ గా చేసుకుని ప్రశ్నలు సంధిస్తాడు. కానీ బాలీవుడ్ లో ఈ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఈ షోకు వస్తూంటారు నటీ, నటులు. ఇక తాజాగా కాఫీ విత్ కరణ్ సీజన్ 7కు హీరోయిన్ కృతి సనన్, హీరో టైగర్ ష్రాఫ్ వచ్చారు.
ఇక ఈ షోలో భాగంగా ఫైనల్ రౌండ్ అయిన రాపిడ్ ఫైర్ ‘కాఫీ బింగో’ రౌండ్ లో ఎవరైనా ఒక సెలబ్రిటీకి ఫొన్ చేసి ‘హే కరణ్ ఇట్స్ మీ’ అని చెప్పించాలి. దాంతో వారికి పాయింట్లు వస్తాయి. కరణ్ కౌంట్ స్టార్ట్ చేయగానే కృతి టాలీవుడ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కు కాల్ చేసింది. హాయ్ ప్రభాస్ అనగానే హాయ్ కృతి అంటూ ప్రభాస్ పలకరించాడు. తాను కరణ్ షో లో ఉన్నట్లు చెప్పింది. ఇక కరణ్ జోహార్ హే బాహుబలి అని హే కరణ్ ఇట్స్ మీ అని చెప్పమనగా ప్రభాస్ అలాగే చెప్పాడు.
దాంతో కృతి రెండు పా యింట్లు గెలుచుకున్నట్లుగా కరణ్ అన్నాడు. ఇక అవతలి ఎండ్ లో ఉన్న టైగర్ అబ్బా కవరేజ్ ఏరియాలో లేరు ఈ కాల్ కలవట్లేదు అని నిరాశను వ్యక్తం చేశాడు. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ స్పందిస్తూ.. ఇది ఈ సీజన్ లో బెస్ట్ మూమెంట్ అనగా.. ఇది చాలా క్యూట్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రస్తుతం ప్రభాస్, కృతి సనన్ లు కలిసి పాన్ ఇండియా మూవీ అయిన ఆదిపురుష్ లో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఒం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా సుమార్ రూ.500 కోట్లతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా వీరిద్దరు ఒకే చిత్రంలో నటిస్తుండటంతోనే ఆ చనువుతోనే కృతి ప్రభాస్ కు కాల్ చేసింది. మరి కృతి డార్లింగ్ కు ఫొన్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
@kritisanon Called Darling #Prabhas From #KoffeewithKaranSeason7 #KaranJohar #KritiSanon #Adipurush #TigerShroff pic.twitter.com/xuiakzdDdl
— Sri Harsha Varma (@mshvarma_) September 1, 2022
“You are amaaaaazing, I will call you back after the show” – #KritiSanon
“Okay Take careeee.” and the shy smile of #Prabhas 🥺😂❤️#Adipurush just keeps getting better for me 😬#KoffeeWithKaran7 pic.twitter.com/vWZgQkNoUM
— manu (@Itsmanvika_) August 31, 2022