ఇస్రో సంస్థలో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేసిన నంబి నారాయణన్.. తన జీవితంలో అనేక ఒడిదుడుకులని ఎదుర్కున్నారు. 1994లో ఇస్రోకు సంబంధించిన రహస్యాలను విదేశాలకు అమ్మారన్న కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. 50 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. కుట్ర ప్రకారం ఆయన్ని కేసులో ఇరికించారని, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, ఆయనపై తప్పుడు కేసు నమోదైనట్లు సీబీఐ వెల్లడించింది. సుప్రీం కోర్టు కూడా నంబిపై విచారణ ఆపాలంటూ కేరళ ప్రభుత్వానికి ఆర్డర్ వేసింది. ఆ తర్వాత నంబి నారాయణన్ ఏ తప్పు చేయలేదని రుజువైంది. నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఇటీవలే ఒక సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మాధవన్ హీరోగా వచ్చిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‘ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో నంబి నారాయణన్ ఎవరు? అతనికి జరిగిన అన్యాయం, అతనిపై మోపిన అభియోగాలు అన్నీ ప్రపంచానికి తెలియజేశారు. నంబి నారాయణన్ అరెస్ట్ కాకపోయి ఉంటే రాకెట్ సైన్స్‌లో దేశం ఎంతో అభివృద్ధి పథంలో ఉండేదన్న విషయాన్ని కూడా ఈ సినిమా ద్వారా తెలియని వారికి తెలియజేశారు.
అయితే అందరూ ప్రశంసిస్తున్న ఇంత గొప్ప సినిమాని ఇస్రో సంస్థ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సినిమాలో ఇస్రో సంస్థకి సంబంధించి చూపించిన సీన్స్‌లో దాదాపు 90 శాతం అబద్ధాలే అని కొట్టిపడేశారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు జయకుమార్ థామస్, ఎల్‌పిఎస్‌సి డైరెక్టర్ ఏ.ఈ.ముత్తునాయగం, క్రయోజెనిక్ ఇంజన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈవీఎస్ నంబూతిరి, క్రయోజెనిక్ ఇంజన్ డిప్యూటీ డైరెక్టర్ డి.శశికుమారన్‌లు మీడియా ముందుకు వచ్చారు. రాకెట్రీ సినిమాతో పాటు నంబి నారాయణన్ పలు టీవీ ఛానల్స్ ద్వారా ఇస్రోతో పాటు ఇతర సంస్థల పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో 90 శాతం అవాస్తవాలే ఉన్నాయని అన్నారు. చాలా ప్రాజెక్టులకు పితామహుడినన నంబి నారాయణన్ చేస్తున్న వాదనలు అబద్ధమని అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను ఆయన ఒక సందర్భంలో కరెక్షన్ చేసినట్లు సినిమాలో చూపించారు, అది పచ్చి అబద్ధమని అన్నారు.
నారాయణన్‌ను అరెస్ట్ చేయడం వల్ల భారత్ క్రయోజెనిక్ టెక్నాలజీని కొనుగోలు చేయడంలో జాప్యం జరిగిందని చూపించిన సన్నివేశం కూడా అబద్ధమేనని అన్నారు. 1980లో క్రయోజెనిక్ టెక్నాలజీని ఇస్రో డెవలప్ చేయడం స్టార్ట్ చేసిందని, అప్పుడు నంబూతిరి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారని అన్నారు. నంబి నారాయణన్‌కి, ఈ ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇస్రోకు సంబంధించి సినిమాలో చూపించిన సంఘటనలు 90 శాతం అబద్ధాలే అని అన్నారు. కొంతమంది సైంటిస్ట్‌లు చేపట్టిన పరిశోధనలకు సంబంధించి క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. సినిమాల్లో చెప్పినవన్నీ నిజమే అని నారాయణన్ కొన్ని టీవీ ఛానల్స్‌లో చెప్పినట్లు తమకు తెలిసిందని, అది పూర్తిగా తప్పే అని అన్నారు. ఈ సినిమాలో చూపించిన అవాస్తవాలపై చర్యలు తీసుకోవాలని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్‌ను కోరినట్లు తెలిపారు. దీనిపై రాకెట్రీ సినిమా యూనిట్ గానీ, నంబి నారాయణన్ గానీ ఇంకా స్పందించలేదు. మరి నంబి నారాయణన్‌పై, రాకెట్రీ సినిమాపై ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
#NambiNarayanan
is fake all the wayhttps://t.co/vm2Mau6FYT— neelammanmohan 🇮🇳 (@neelamcrosscom) August 25, 2022