సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అదీ కాక సినిమా సినిమా కి బాడీ షేప్ మార్చల్సి వస్తుంది. దాని కోసం వారు స్పెషల్ గా ట్రైనర్స్ ను ఏర్పటు చేసుకోవడం ఇండస్ట్రీలో సహజమే. ఈ క్రమంలోనే ఓ సెలబ్రిటీ ట్రైనర్ కుల్దీప్ సేథి హీరో రామ్ చరణ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్.. సినిమా కోసం ఎంత కష్ట పడతాడో మనందరికి తెలిసిందే. ఇక మూవీ కోసం డైరెక్టర్ ఏవింధంగా మారమంటే ఆ విధంగా మారాలి. దాని కోసం బాడీని కష్ట పెట్టక తప్పదు. ఇందులో భాగంగానే వారికి జిమ్ ట్రైనర్స్ అవసరం అవుతారు. ఈ క్రమంలోనే తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 360 డిగ్రిస్ జిమ్ ఓనర్, సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేథి తనకు రామ్ చరణ్ కు ఉన్న పరిచయాన్ని తెలియజేశాడు. మీరు సినీ తారలకు కూడా ట్రైన్ ఇస్తారా అని యాంకర్ అడగ్గా.. అతడు ఈ విధంగా స్పందించాడు.'' నేను మెుదట ట్రైనింగ్ ఇచ్చిన సెలబ్రిటీ రామ్ చరణ్ గారే. చిరుత సినిమా కోసం చరణ్ నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతడు మన బాస్ మెగాస్టార్ కొడుకు అని నాకు తెలీదు. కొన్ని రోజుల తర్వత నా ఫ్రెండ్ వచ్చి అతను ఎవరో నికు తెలుసా? అంటే తెలీదు అని చెప్పా.. రేయ్ అతను చిరంజీవి కొడుకు రా అని అప్పుడు చెప్పాడు. తర్వత ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని చరణ్ అడగ్గా.. దాంట్లో చెప్పడానికి ఏముంది అంటూ సింపుల్ గా సమాధానం చెప్పాడు. చరణ్ చాలా మంచి మనిషి డౌన్ టూ ఎర్త్ నుంచి వచ్చిన వాడు. మాతో చాలా సరదాగా ఉంటాడు. అని చెప్తూనే మెగాస్టార్ గారికి కూడా రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చే అదృష్టం కలిగిందని'' సంతోష పడ్డాడు. ఇక ఈ రంగంలో ఎన్ని ఏళ్లుగా పనిచేస్తున్నారని ప్రశ్నించగా.. 2004 నుంచి నేను ట్రైనర్ గా నా జీవితాన్ని ప్రారంభించాను. 18 సంవత్సరాలుగా చాలా మంది సెలబ్రిటీలకు కోచ్ గా చేశా. వరుణ్ తేజ్ కు దాదాపు 7 సంవత్సరాలుగా ట్రైన్ ఇచ్చా తాజాగా లైగర్ కోసం విజయ్ దేవరకొండకు కూడా ట్రైనింగ్ ఇచ్చాను. అప్పట్లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాళ్యాణ్ రామ్ ఇజం మూవీ కోసం సిక్స్ ప్యాక్ బాడీని నేనే ట్రైన్ చేశా.'' అంటూ పలు విషయాలు అభిమానులతో పంచుకున్నారు కుల్దీప్. మరి ఈ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Bigg Boss 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో రియల్ కపుల్ మెరీనా- రోహిత్! ఇదీ చదవండి: Liger Twitter Review: విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ ట్విట్టర్ రివ్యూ!