దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో వస్తున్న మూవీ వాంటెడ్ పండుగాడు. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది దీపిక పిల్లి. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫోటోలు, టీజర్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రమోషన్ లో బిజీ బిజీగా ఉంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సుడీగాలి సుధీర్, దీపిక పిల్లి, విష్ణుప్రియ. ఇక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. ఈ ఇంటర్వ్యూకి ఓ స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. అతన్ని ఇన్వైట్ చేద్దామంటూ సుడిగాలి సుధీర్ ని పిలుస్తారు. వెంటనే సుధీర్ రాగానే.. విష్ణు ప్రియ రియాక్ట్ అయి.. నువ్వా.. నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా నీ ఫేసే చూడాలా..! హీరోయిన్ అవ్వకముందే నీ ఫేసే.. హీరోయిన్ అయ్యాక నీ ఫేసే చూడాలా అంటూ నవ్వుతూ అంటుంది.
వెంటనే యాంకర్ స్పందిస్తూ.. స్పెషల్ గెస్ట్, స్పెషల్ పర్సన్ అంటే మరీ మా ఎక్స్ పెక్టేషన్ అక్కడున్నాయని అంటూనే… లేదు లేదు.. నేను హోస్ట్, నేను హ్యపియే అంటూ కూర్చుంటుంది. వెంటనే దీపిక పిల్లి స్పందిస్తూ.. సుధీర్ గారు స్పెషలే అని అంటుంది. వెంటనే యాంకర్ స్పందిస్తూ.. ఏంటీ.. మీ హీరోనా అనా ఈ సపోర్ట్ అంతా అని అనగానే దీపిక స్పందిస్తూ.. అంతే కదా మరి అని కామెంట్ చేసింది. సుధీర్ ను ఉద్దేశిస్తూ దీపిక పిల్లి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. సుధీర్ పై దీపిక పిల్లి చేసిన ఈ స్పెషల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.