రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ అంటే తెలియనివారుండరేమో. అంతటి ప్రాధాన్యతను సంపాదించుకున్న ఈ సీరియల్ ఏ బుల్లితెర షోలకు లేని రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ సీరియల్ లో కార్తీక దీపం అంటే వంటలక్క.. వంటలక్క అంటే కార్తీకదీపం అన్నట్టుగా ఎంతో ఫేమస్ అయింది వంటలక్కపాత్రలో మెరిసిన దీప. బుల్లితెర టీవీ సీరియల్స్ లో ప్రసారమయ్యే ఈ సీరియల్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దాదాపుగా నాలుగేళ్లపాటు సాగిన ఈ సీరియల్ లో దీప 1298 ఎపిసోడ్ లలో మెరిసి తన నటనతో అందరినీ తన వైపుకు తిప్పుకుని ఉన్నట్టుండి ఆ సీరియల్ నుంచి అనుహ్యంగా తప్పుకుంది. అయితే అప్పటి నుంచి ఈ సీరియల్ రేటింగ్ టాప్ లో ఉన్నప్పటికీ పూర్వవైభవం మాత్రం కనిపించడం లేదు. దీంతో వంటలక్క వెళ్లినప్పటి నుంచి ఎంతో మంది ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే కార్తీకదీపం అభిమానులు గుడ్ న్యూస్ అంటూ తెలిపింది దీప. అసలు విషయం ఏంటంటే? కార్తీకదీపం సీరియల్ లో తన రీ ఎంట్రీ అన్నట్లుగా దీప తాజాగా ఓ ప్రోమోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో కట్టు, బొట్టుతో మరోసారి వంటలక్క పాత్రలో కనిపించేందుకు సిద్దమైనట్లుగా ఈ ప్రోమోను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. దీప ఈ ప్రోమోను పోస్ట్ చేస్తూ.. వస్తున్నా.. మీ కోసం అంటూ రాసుకొచ్చింది. దీనిని చూసిన ఆమె అభిమానులు ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ వంటక్క.. మీతో పాటు డాక్టర్ బాబును కూడా వెంటతీసుకురండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కార్తీకదీపం సీరియల్స్ లోకి మరోసారి ఎంట్రీ ఇస్తున్న వంటలక్క పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Premi Viswanath (@premi_vishwanath) ఇది కూడా చదవండి: హీరో చెల్లెలి క్యారెక్టర్ కోసం అడిగితే లయ ఏడ్చేసింది: వినాయక్