‘దసరా’ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన ప్రతి చోట కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. దర్శకత్వం వహించిన తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు శ్రీకాంత్ ఓడెల. ప్రేక్షకులు కూడా అతడ్ని మెచ్చుకుంటున్నారు. అలాంటి శ్రీకాంత్‌కు ఓ క్రేజీ ఆఫర్ దక్కిందని సమాచారం. మిగిలిన వివరాలు..
గత కొన్ని వారాలుగా స్తబ్దుగా ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఒక్కసారిగా ఫుల్ జోష్ వచ్చింది. సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ తర్వాత చాన్నాళ్లు సరైన సినిమా రాలేదు. దీంతో థియేటర్లు బోసిపోయాయి. మధ్యలో ‘బలగం’ లాంటి మూవీ వచ్చింది. ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. థియేటర్లకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడ్ని కంటతడి పెట్టించింది. ఈ సినిమా హవా కాస్త తగ్గగానే ఇప్పుడు మరో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’. శ్రీరామనవమి కానుకగా మార్చి 30న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ప్రతి చోట రికార్డు స్థాయి వసూళ్లతో దుమ్మురేపుతోంది.
‘దసరా’ చిత్రం రిలీజైన రెండ్రోజుల్లోనే రూ.53 కోట్ల మార్కును అందుకుని చరిత్ర సృష్టించింది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘దసరా’. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.100 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ సాధించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందంపై ప్రశంసలు కురుస్తున్నాయి. నాని, కీర్తి సురేష్‌ల నటన అద్భుతం అంటూ అందరూ కొనియాడుతున్నారు. అలాగే తొలి సినిమానే ఇంత బాగా తెరకెక్కించడం గ్రేట్ అంటూ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెలను మెచ్చుకుంటున్నారు. స్టార్ నటీనటులను బాగా హ్యాండిల్ చేస్తూ.. మూవీని భారీగా తెరకెక్కించారని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చూశారు.
‘దసరా’ను చూసిన తర్వాత మహేష్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మూవీకి ఆయన వన్ వర్డ్ రివ్యూ ఇచ్చారు. ‘దసరా మూవీ విషయంలో ఎంతో గర్విస్తున్నా. ఇది అద్భుతమైన సినిమా’ అని మహేష్ ట్వీట్ చేశారు. దీంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగిపోయింది. మహేష్ లాంటి అగ్రకథానాయకుడు తమ మూవీపై ట్వీట్ చేయడంతో ఆనందంలో తేలుతున్నారు. ఇలాంటి తరుణంలో ఫిలిం సర్కిల్స్‌లో ఓ ఆసక్తికరమైన రూమర్ వినిపిస్తోంది. ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల పనితీరు మహేష్ బాబుకు బాగా నచ్చిందట. దీంతో సూపర్ స్టార్ తర్వాతి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం శ్రీకాంత్‌ను వరించనుందని టాలీవుడ్ టాక్.
ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీలో నటిస్తున్న మహేష్.. ఆ మూవీ పూర్తవగానే రాజమౌళితో జాయిన్ కానున్నారు. మరో మూడేళ్ల వరకు ఆ ప్రాజెక్టు పని మీదే మహేష్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఆయన నటించబోయే చిత్రానికి శ్రీకాంత్ ఓడెల డైరెక్షన్ వహిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటు మహేష్ బాబు గానీ.. అటు శ్రీకాంత్ ఓడెల గానీ కన్ఫర్మ్ చేయలేదు. వీరిలో ఎవరో ఒకరు దీనిపై క్లారిటీ ఇస్తే కానీ.. ఈ రూమర్స్‌పై స్పష్టత రాదు. మరి.. శ్రీకాంత్ ఓడెల-మహేష్ కాంబోలో ఓ రగ్గ్డ్ మాస్ చిత్రం రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
So so proud of #Dasara!! Stunning cinema! 🔥🔥@NameisNani @KeerthyOfficial @Dheekshiths @thondankani @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP
— Mahesh Babu (@urstrulyMahesh) March 31, 2023