గత కొద్దిరోజులుగా బ్యాంకులు, వాటికి సంబంధించిన నిర్ణయాలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లు పెంచుతూ పోతున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ రెపో రేట్ పెంచడం వల్ల హౌస్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లోన్ ఇలా అన్ని రకాల లోన్లు తీసుకున్న వారిపై ఆ ప్రభావం పడింది. వారు చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐల భారం మరింత పెరిగింది. దాదాపు అన్ని బ్యాంకులు నెలనెలా తమ వడ్డీ రేట్లను పెంచుతూ పోయాయి. ఇన్ని షాకింగ్ వార్తల మధ్య బ్యాంకు ఖాతాదారుల్లో కొందరికి మాత్రం ఇది బాగా కలిసొచ్చింది. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ పోతుంటే కొందరు మాత్రం వారికి అది శుభవార్త అన్నట్లే ఉంది. అవును.. వాళ్లు ఎవరో? వారికి అది శుభవార్త ఎలా అయ్యిందో చూద్దాం.
చాలామంది బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్ తీసుకోవడం, క్రెడిట్ కార్డులు తీసుకోవడం, లోన్స్ తీసుకోవడం చేస్తుంటారు. అయితే కొందరు బ్యాంకుల్లో డబ్బుని ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) రూపంలో దాచుకుంటారని తెలుసు కదా. కొంత మొత్తాన్ని ఫలానా రోజులకు అని గడువు పెట్టి బ్యాంకులో ఎఫ్‌డీ చేస్తారు. ఆ ఎఫ్‌డీ మీద బ్యాంకులు వాటి రూల్స్ ప్రకారం ఇంత వడ్డీ అని చెల్లిస్తుంటాయి. డిపాజిట్ మొత్తం మెచ్యురిటీకి వచ్చిన తర్వాత అసలు, వడ్డీ కలిపి ఖాతాదారులకు చెల్లిస్తారు. ఈ ఎఫ్‌డీలలో సీనియర్ సిటిజన్స్ కు అయితే కాస్త ఎక్కువే వడ్డీని ఆఫర్ చేస్తుంటారు. అందుకే చాలామంది ఈ ఎఫ్‌డీల వైపు ఆకర్షితులు అవుతుంటారు.
అయితే ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న రెపో రేటు నిర్ణయంతో బ్యాంకులు వడ్డీలను పెంచాయి. అంటే మనం బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ రేటు పెరిగింది. అదేవిధంగా బ్యాంకులు ఎఫ్‌డీలు చేసిన వారికి చెల్లించాల్సిన వడ్డీరేటు కూడా పెరిగిందనమాట. అందుకే అది వారికి శుభవార్త అయింది. అయితే అన్నీ బ్యాంకులు ఈ ఎఫ్‌డీపై వడ్డీలను పెంచలేదు. కొన్నిమాత్రం తమ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీరేటుని పెంచి మిగిలిన బ్యాంకులను కాదని ఖాతాదారులు వారిని ఎంచుకునేలా చేస్తున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వారి దగ్గర ఎఫ్‌డీ చేసిన వారికి 7 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచే ఆ వడ్డీ రేటు అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. కెనరా బ్యాంక్ వాళ్లు కూడా రూ.2 కోట్లలోపు చేసే ఎఫ్‌డీలపై వడ్డీని పెంచింది. 666రోజులతో ప్రత్యేక స్కీమ్ తీసుకొచ్చింది. దానిలో సాధారణ పౌరులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ లాంటి బ్యాంకులు సైతం ఏడాదిన్నర గడువు పైబడిన ఎఫ్‌డీలకు సాధారణ పౌరులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
ఇదీ చదవండి: 90 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్.. SBI ఖాతాదారులవి కూడా..!
ఇదీ చదవండి: ఆ బ్యాంకులో అకౌంట్ ఉందా..? అయితే మీకో శుభవార్త!
ఇదీ చదవండి: కొత్త కారు కొనాలనుకునే వారికి దీపావళి బంపరాఫర్.. ఏకంగా 40 వేలు తగ్గిస్తూ!