సొంత కారు కొనుక్కోవాలి అనేది ప్రతి ఒక్కరికి కల.. ఆ కలను నెరవేర్చుకోవాలంటే అందరికీ సరైనా అవకాశాలు, సమయం దొరక్కపోవచ్చు. నిజానికి గతంలో అయితే కారు అనేది విలాసంగా ఉండేది. కానీ, మారుతున్న జీవనశైలి, అవసరాల రీత్యా కారు కూడా అవసరంగా మారిపోయింది. కొంతమందికి అయితే కారు జీవనోపాధిని కూడా కల్పిస్తోంది. అయితే పండగల సీజన్ రాగానే.. ఫోన్లు, గృహోపకరణాల మీద ఆఫర్లు బాగా వినిపిస్తూ ఉంటాయి. కానీ, ఈ దీపావళికి కార్ల మీద కూడా మెగా ఆఫర్లు, డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అయితే మరి ఆ దీపావళి ఆఫర్లు ఏ కార్లపై ఉన్నాయి? ఏ కారుపై ఎంత డిస్కౌండ్ ఇస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం రండి.
ఈ దీపావళి డిస్కౌంట్స్ ప్రకటించింది ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం హోండా. అవును హోండా కార్లపై ఆ కంపెనీ భారీ డిస్కౌంట్స్ ని ప్రకటించింది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, తగ్గింపులు, లాయల్టీ డిస్కౌంట్ ఇలా చాలా రకాల ఆఫర్లను ప్రకటించింది. నిజానికి హోండా కంపెనీ కార్ల అమ్మకాల తగ్గిన మాట వాస్తవమే. ఈ పండగ సీజన్‌ని బేస్ చేసుకుని వినియోగదారులను ఆకర్షించాలని, అమ్మాకుల పెంచుకోవాలని హోండా కంపెనీ చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు దీపావళికి ఈ ఆఫర్లు, డిస్కౌంట్స్ ని ప్రకటించిందని చెబుతున్నారు. ఈ దీపావళి ఆఫర్లలో తమ కార్లపై గరిష్టంగా రూ.40 వేల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు హోండా కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా ఇండియన్ మార్కెట్‌లో SUVని లాంఛ్ చేయాలని హోండా ప్రకటించింది.
హోండా అనగానే అందరికీ గుర్తొచ్చే మోడల్ సిటీ.. ఈ ఆఫర్‌లో హోండా సిటీ లేటెస్ట్ జనరేషన్ కారుపై గరిష్టంగా రూ.37,896 వరకు తగ్గింపు ప్రకటించింది. అది ఏవిధంగా అంటే రూ.10 వేలు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ ఛేంజ్ ఇన్సెన్‌టివిగా రూ.7 వేలు, రూ.5 వేలు కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ రివార్డ్స్ కింద రూ.5 వేలు, ఎక్స్ ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ.10 వేల వరకు ఆఫర్ చేస్తోంది. ఈ కంపెనీకి చెందిన హోండా అమేజ్ కూడా మంచి సెల్లింగ్ మోడల్.. దీనిపై అన్నీ కలిపి రూ.8 వేల వరకు డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తున్నారు. హోండా W-RV అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ కారుపై అన్ని ఆఫర్స్ కలిపి.. ఏకంగా రూ.39,298 వరకు డిస్కౌంట్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. హోండా కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలంటూ వినియోగదారులను కోరుతోంది.
హోండా కంపెనీ కార్లలో జాజ్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ కారులో ఆటోట్రాన్స్ మిషన్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ కారుపై కూడా హోండా కంపెనీ దీపావళి ఆఫర్లు ప్రకటించింది. హోండా జాజ్‌పై గరిష్టంగా రూ.25 వేలు వరకు ఆఫర్స్ ప్రకటించింది. వాటిలో రూ.10 వేలు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, రూ.7 వేలు ఎక్స్ ఛేంజ్ బోనస్, రూ.3 వేలు కార్పొరేట్ డిస్కౌంట్‌గా అందిస్తోంది. క్లైంట్ లాయల్టీ బోనస్‌గా రూ.5 వేలు అందిస్తున్నారు. హోండా సిటీ 4th జనరేషన్‌పై కేవలం రూ.5 వేలు మాత్రమే డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఈ కారుపై ఎలాంటి కార్పొరేట్ డిస్కౌంట్స్, అదనపు ప్రయోజనాలు, ఎక్స్ ఛేంజ్ బోనస్‌లు వర్తించవు. 2014లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ మోడల్.. ఈ ఏడాది వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన మీరు మెచ్చిన కారు హోండాలో ఉంటే వెంటనే దీపావళి ఆఫర్స్ లో సొంతం చేసుకోండి.